జనవరిలో సూర్య ఎన్‌జికె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో సూర్య విలక్షణ దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్‌జికె సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం విడుదల డేట్‌ను ఫిక్స్ చేశారు నిర్మాతలు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న సినిమాను విడుదల చేస్తారట. వారంపాటు షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టినట్టు నిర్మాతలు చెబుతున్నారు. జనవరిలో విడుదల కనుక, డిసెంబర్ నుంచే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. సూర్య సరసన రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా అలరించనున్నారు. యువన్ శంకర్‌రాజా అందిస్తోన్న సంగీతంపై హీరో సూర్య సైతం పెద్ద నమ్మకమే పెట్టుకున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమాను ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.