ప్రేమ ఆకర్షణ -నెక్ట్స్ ఏంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమన్నా, సందీప్‌కిషన్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్ దర్శకుడు కునాల్‌కోహ్లీ దర్శకత్వంలో వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ -నెక్ట్స్ ఏంటి? నవదీప్, పూనమ్‌కౌర్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న చిత్రానికి సంబంధించి ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా చిత్రం ట్రైలర్ విడుదలైంది. అమ్మాయి-అబ్బాయి మధ్య ప్రేమ, ఆకర్షణ అంశాలను ఇందులో ప్రస్తావించారు. ‘నేను చెప్పిన రెండు కారణాలు తీసేస్తే -అబ్బాయిలకు అమ్మాయిలతో, అమ్మాయిలకు అబ్బాయిలతో అవసరం ఉండదు’ అన్న తమన్నా ఆసక్తికర డైలాగ్‌ను ట్రైలర్‌లో చూపించారు. ఆడువారి మాటలకు అర్థాలు వేరులే -అన్న రొటీన్ డైలాగ్‌ను ట్విస్ట్ చేసుకుంటూ ‘మా అబ్బాయిలు మాట్లాడే మాటల్లో అర్థాలు వేరే ఉంటాయి’ అని తమన్నాతో నవదీప్ అంటాడు. ‘నా జీవితంలో మళ్లీ నిజమైన ప్రేమ దొరుకుతుందా?’ అని తమన్నా తననుతానే ప్రశ్నించుకోవడం, ‘అబ్బాయిల్ని ఏ విషయంలో ఎంత కంట్రోల్ చేయాలో మీ అమ్మాయిల చేతుల్లోనే ఉంటుంది’ అని తమన్నా ఫాదర్ అంటే,‘అవును... ఆ కంట్రోల్‌కి ఒప్పుకొనే ఏ మగాడైనాసరే జీవిత భాగస్వామిగా సెట్టవ్వడు’ అని తమన్నా చెప్పే డైలాగులతో టీజర్ కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో దర్శకుడు కునాల్‌కోహ్లీ మాట్లాడుతూ ‘సినిమా స్క్రిప్ట్‌ను ముందు శరత్‌బాబుకి పంపాను. ఆయన థ్రిల్ ఫీలై -నన్ను హైదరాబాద్‌కి రమ్మన్నారు. ఫాదర్ అండ్ డాటర్ మధ్య సన్నివేశాలు బాగున్నాయన్నారు. ఇండియన్ కల్చర్‌ని తెలిపే సినిమా ఇది. ఒక సినిమాకి భాష ఇబ్బందికాదు. ఏ భాషలోనైనా సినిమా బాగుంటే ఆడుతుంది అన్నారు. హీరో నవదీప్ మాట్లాడుతూ ‘సినిమాలో తనను తీసుకున్నందుకు కునాల్‌కు థాంక్స్. తమన్నా డబ్బింగ్, ఆమె చేసిన హార్డ్‌వర్క్ బాగుంది. సందీప్ యాక్టివ్‌గా కనిపించాడు. ట్రైలర్‌ను యూత్‌కి కనెక్టయ్యేలా కట్ చేశారు. నిజానికి సినిమాలో అంతకంటే ఎక్కువ కంటెంటే ఉంటుంది. సినిమా బాగా ఆడాలి’ అన్నాడు. హీరో సందీప్‌కిషన్ మాట్లాడుతూ ముందుగా కునాల్ డైరెక్టర్ అనగానే బాలీవుడ్ మూవీ అనుకున్నా. తర్వాత తెలిసింది తెలుగు సినిమా అని. కథ వినగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సినిమాలోని నా లుక్ సంతృప్తినిచ్చింది. హీరోగా నన్ను ఎంచుకున్న కునాల్‌కు థాంక్స్. నా పాత్ర బాగుందంటే అది ఆయన క్రెడిట్టే. మ్యూజిక్ బాగుంది. నేను వర్క్‌చేసిన నిర్మాతల్లో బాగా నచ్చిన నిర్మాత కిరణ్. తర్వాత బాగా కంఫర్ట్ ఫీలైన ప్రొడ్యూసర్ అక్షయ్. తమన్నాతో వర్క్ చేయడం, నా ఎక్స్‌పీరియన్స్ పెరిగింది అన్నారు. తమన్నా మాట్లాడుతూ తెలుగు సినిమా రోజురోజుకి మారుతోందని, నేషనల్ సినిమా స్థాయిని దాటిపోతోందన్నారు. నేను ముంబైలో పుట్టినా తెలుగు సినిమా నాకు ముఖ్యం. కునాల్‌కు బిగ్ వెల్‌కం. సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన మరింత దగ్గరవ్వాలని, సూపర్ హిట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ ఏంటి? కథ విన్నప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందులో నా పాత్ర నేనే ప్లే చేస్తున్నానా? అనిపించింది. ఇటు సందీప్‌తో, అటు కళ్లతో నటించగల నవదీప్‌తో నటించడం కొత్తగా అనిపించింది. షూట్ మొత్తం ఎంజాయ్ చేశాం. డిసెంబర్‌లో మీ ముందుకొస్తుంది, ఆదరించండి’ అని కోరింది.