లారా పాత్రకు తనీష్ ఒక రిఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు అండ్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తనీష్, పరుచూరి రవి, ప్రియాసింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, షఫీ, పోసాని కృష్ణమురళి ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘రంగు’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో రాజ్‌కందుకూరి మాట్లాడుతూ తనీష్‌ను అతని బాల్యం నుంచే చూస్తున్నామని, ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సినిమాలో తనీష్ కనపడలేదు లారానే కనపడ్డాడు. లారా కుటుంబ సభ్యులు ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా విశేషంగా ప్రజలను ఆకట్టుకుంటుందని నా నమ్మకం అన్నారు. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ మాట్లాడుతూ ఈవెంట్‌కు రావడానికి కారణం నిర్మాత పద్మనాభరెడ్డి. అనేకమందికి చేయూతనిచ్చి తాను ఎదుగుతూ పదిమందికి ఉపయోగపడుతున్నారు. రంగు చాలా ఆరోగ్యకరమైన సినిమా. గాయంలో ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జగాన్ని’ అనే పాట రాశాను. అది నాకు చాలా సంతృప్తినిచ్చింది. చాలాకాలం తరువాత ‘ఎక్కడ ఉంది ఈ చిక్కుముడి’ అంటూ రంగులో ఒక పాట రాయడం జరిగింది. అప్పటికీ ఇప్పటికీ సమాజంలో ఏ మార్పు లేదు. రంగులో పాటలు బాగున్నాయి. దర్శకుడు కార్తికేయకున్న పట్టుదలవల్లనే ఈ సినిమా పట్ల ఆశావహ దృక్పథం కలిగించింది. లారా పాత్రలో తనీష్ నటన ఒక రిఫరెన్స్‌లా మిగులుతుందన్నారు. నటుడు పరుచూరి రవి మాట్లాడుతూ రెగ్యులర్ పోలీసు పాత్రలకంటే భిన్నంగా నా పాత్ర ఉంటుందన్నారు. హీరో తనీష్ మాట్లాడుతూ సినిమాలో సిరివెనె్నల సీతారామశాస్ర్తీ, పరుచూరి వెంకటేశ్వరరావువంటి దిగ్గజాలతో కలిసి పనిచేశాను. మూడు కారణాలతో నేను చాలా ఆనందంగా ఉన్నాను. కార్తికేయ నాతో సినిమా చేసినందుకు ఆయనకు థాంక్స్. పద్మనాభరెడ్డి ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్‌గా ఎదగాలని కోరుకుంటున్నాను. సురేందర్‌రెడ్డి అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇందులో హీరోలు, విలన్స్ లేరు. అన్నీ పాత్రలే. ప్రతి పాత్ర ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదనే విషయాలను నేర్పిస్తుంది అన్నారు. చిత్ర దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ దర్శకుడిగా తొలి చిత్రం కాబట్టి డిఫరెంట్ స్టోరీతో సినిమా చేయాలనుకున్నాను. సొసైటీకి ఏదైనా మంచి మెసేజ్ ఇచ్చేలా ఉండే సినిమా చేయాలనుకుంటున్న తరుణంలో లారా గురించి విన్నాను. ఆయన స్నేహితులను కలిసి కథను తయారుచేసుకున్నాను. పరుచూరి బ్రదర్స్ దీన్ని కమర్షియల్ ఫార్మెట్‌లోకి మార్చి అద్భుతంగా మలిచారు. తనీష్ లారా క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. సపోర్టు చేసిన అందరికీ థాంక్స్ అన్నారు. నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ-ఏదైనా కొత్తగా చేసి చూపించాలి, అలా చేసినపుడే అందరూ మనల్ని గుర్తుపెట్టుకుంటారు. రేపు నా బ్యానర్ నుండి ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే సినిమాకు ఖచ్చితంగా ఓ విలువ ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. రంగుతో అద్భుతమైన సినిమా తీశామని నమ్మకం ఉంది అన్నారు.