23న వస్తున్న రూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ, సోనాపటేల్ హీరోహీరోయిన్లుగా పైడి రమేష్ దర్శకత్వంలో పైడి సూర్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం రూల్ (ది పవర్ ఆఫ్ పీపుల్). 23న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు పైడి రమేష్ మాట్లాడుతూ రూల్ సినిమా ప్రమోషన్స్‌లో ఆడియోను ఏపీ సీఎం చంద్రబాబు, దర్శకుడు కె రాఘవేంద్రరావు మోషన్ పోస్టర్లను, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫస్ట్‌లుక్, అశ్వీనీదత్ టీజర్, బోయపాటి శ్రీను ట్రైలర్‌నును విడుదల చేశారన్నారు. ఇంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు అందిస్తోన్న సపోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కథ విషయానికి వస్తే హీరో యువజన నాయకుడని, తన కుటుంబంతోపాటు ఏ నిరుపేదకు అన్యాయం జరుగకుండా ఎదుర్కొంటూ ఎలా ఆదర్శవంతుడిగా నిలిచాడన్నది ఇతివృత్తమన్నారు. చిత్రంలో నాలుగు పాటలున్నాయని, రమణసాయిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నామన్నారు. నిర్మాత పైడి సూర్యనారాయణ మాట్లాడుతూ ఆవేశం కంటే ఆలోచన ముఖ్యమని, మనీ కంటే మనుషుల విలువలు ముఖ్యమని తెలియజెప్పే మంచి మేసేజ్ చిత్రాన్ని నిర్మించానని, ఫస్ట్ కాపీ తర్వాత కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో రూల్ చిత్రం విడుదల కావడం సంతోషమన్నారు. హీరోయిన్ సోనాపటేల్ మాట్లాడుతూ మంచి కానె్సప్ట్ ఉన్న చిత్రమిది. నాకు మంచి పంచ్ డైలాగ్స్ ఇచ్చారన్నారు. హీరో శివ మాట్లాడుతూ కెమెరామెన్‌గా వున్న తనను దర్శకుడు ఈ సినిమాలో హీరోని చేశారన్నారు. ప్రజలకు మంచి వినోదాన్ని అందించే చిత్రమని, తప్పకుండా ఆదరించాలని కోరారు.