నయన్ ‘..విక్రమాదిత్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘ఇమైక్కా నొడిగళ్’ తెలుగు భాషలోకి అనువాదం అవుతుంది. విశ్వశాంతి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై సిహెచ్.రాంబాబు, ఆచంట గోపీనాథ్‌లు ఈ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. క్రైమ్‌థ్రిల్లర్‌గా వచ్చి విజయవంతం అయిన ఈ చిత్రానికి తెలుగులో అంజలి విక్రమాదిత్య టైటిల్‌ని ఖరారుచేసారు. ఆర్.అజయ్ గనన్ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, అధర్వ, రాశిఖన్నాలు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రతి నాయకునిగా కనిపించనున్నారు.
ఈ సినిమాలో అంజలి పాత్రలో నయనతార కనిపించనుండగా, విక్రమాదిత్య పాత్రలో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో మెరవనున్నారు. తమిళంలో క్యామియో ఫిలిమ్స్ బ్యానర్ పతాకంపై సీజే జయకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించగా, హిప్ హాఫ్ తమిళ సంగీతం, ఆర్‌టి రాజశేఖర్ సినిమాటోగ్రఫీని అందించారు. డబ్బింగ్ కార్యక్రమాలు ఎంతో చురుకుగా సాగుతుండగా ఈ చిత్రాన్ని జనవరిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.