మహేష్ బాలీవుడ్ ప్లాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయా అంటే అవుననే టాక్. మహేష్ బాలీవుడ్ డెబ్యూకి గతంలో ఎన్నో ఛాన్సులు వచ్చినా ఎందుకనో ఆసక్తికనబరచలేదు. తొలుత టాలీవుడ్‌లో తన స్థానాన్ని స్థిరపరుచుకున్న తర్వాతనే ఇతర భాషల్లో ప్రయోగాలు చేయాలని భావించిన మహేష్ బాలీవుడ్ సహా ఇతర భాషల్లో నటించాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ప్రస్తుతం మహేష్ సౌతిండియలోనే ఎదురేలేని స్టార్. అతడు తన ప్రతిభను అతిపెద్ద మార్కెట్ ఉన్న బాలీవుడ్‌కి- ఉత్తరాదికి విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. మారిన ట్రెండ్‌లో సౌతిండియా స్టార్లు ఇరుగుపొరుగు భాషల్లోనూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. అందుకే తాను కూడా ఆ దిశగా సీరియస్‌గానే ఆలోచించిన మహేష్ ప్రణాళికల్లో వేగం పెంచారు. అయితే మహేష్‌లాంటి అసాధారణ ఛరిష్మా ఉన్న స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలంటే లాంచింగ్ అంతే ఘనంగా ఉండాలన్నది తొలినుంచి ప్లాన్. అందుకే గత రెండు మూడేళ్లుగా ఆ ఆలోచన ఉన్నా సరైన సమయంకోసం మహేష్ వేచి చూస్తున్నారు. మహేష్ లాంటి స్టార్ యూనివర్సల్ అప్పీల్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలవంటే ఎస్.ఎస్.రాజవౌళి లాంటి స్టార్ డైరెక్టర్ బరిలో దిగితేనే బావుంటుందన్నది ఓ ప్లాన్ అని తెలిసింది. ఆ క్రమంలోనే మహేష్- రాజవౌళి సినిమా గురించి గత రెండుమూడేళ్లుగా ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఆ ఇద్దరి కలయికమాత్రం సాధ్యపడడం లేదు. తాజా సమాచారం ప్రకారం రాజవౌళి వినిపించిన లైన్‌ని మహేష్ ఓకే చెప్పారు. ఇక దానిని పూర్తిగా స్క్రిప్టుగా మలిచి సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంటుందిట. ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ ఈరోజు మొదలైంది.