అంగట్లో.. తైమూర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తైమూర్. ఆ పేరే ఓ క్రేజీ. పిల్లాడు -బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ కిడ్. బాలీవుడ్ పటౌడీ దంపతులు సైఫ్ అలీ ఖాన్, కరీనా కఫూర్‌ల గారాలపట్టి తైమూర్ అలీఖాన్. ఎప్పుడోగాని బయటకు కనిపించిన ఈ సెలబ్రిటీ కిడ్‌ను ఇప్పుడు ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడబడితే అక్కడ చూడొచ్చు. ఎందుకంటే -తైమూర్ బొమ్మలు దుకాణాలకెక్కాయి. కేరళలోని ఓ బొమ్మల దుకాణంలో కనిపించిన తైమూర్ బొమ్మను ఫొటో తీసి -సోషల్ మీడియాకు ఎక్కించాడు ఓ నెటిజన్. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే తైమూర్‌ను మీడియా వదలడం లేదని, ఇది తమకు ఇబ్బంది కలిగిస్తోందని గతంలో కరీనా, సైఫ్‌లు ఒకింత ఆసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. ఈ బాధ పడలేకే తైమూర్‌ను ఫారిన్ బోర్డింగ్ స్కూల్లో వేసేందుకూ నిర్ణయించారని సమాచారం. తాజాగా తైమూర్ బొమ్మలు దుకాణాల్లో దర్శనమిస్తున్నాయంటే -పటౌడీ కపుల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.