ఫస్ట్‌లుక్‌లో ఓడియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూవీ లెజెండ్ మోహన్‌లాల్ మలయాళంలో నటిస్తున్న అత్యంత భారీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఓడియన్’. ఈ చిత్రానికి అక్కడే కాకుండా తెలుగు ట్రేడ్‌లో కూడా చాలా మంచి క్రేజ్ వుంది. ఈ చిత్రంకోసం మోహన్‌లాల్ గారు యోగా మరియు వ్యాయామాలు చేసి తన వయసుని 55 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు కనిపించేలా శరీరాన్ని మార్చుకొని నటించిన చిత్రం కావటం.. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో నిర్మిస్తుండడంతో ఈ క్రేజీ ప్రాజెక్టుకి సౌత్ ఇండియా అంతా హ్యూజ్‌క్రేజ్ వచ్చింది. టాలీవుడ్‌కి సంబంధించిన చాలామంది బడా నిర్మాతలు పోటీపడినా కూడా దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన దగ్గుబాటి అభిరామ్‌గారు, సంపత్‌కుమార్‌గారు ఈ చిత్రం తెలుగు హక్కులు పొందటం విశేషం.
ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ చిత్రాన్ని మలయాళం, తెలుగులో డిసెంబర్ 14న గ్రాండ్‌గా ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. మోహన్‌లాల్‌గారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన స్టామినా ఎంతో చాలా సినిమాల్లో చూసాం. ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో ఆయన నటిస్తున్న ఓడియన్ చిత్ర తెలుగు హక్కుల్ని మా దగ్గుబాటి క్రియేషన్స్ సొంతం చేసుకుంది. సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా భారీ కాంపిటీషన్ నడుమ ఈ సినిమా హక్కులు పొందాం. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌గారు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన అందించిన విషెస్ మా టీంకి బలాన్నిచ్చింది. దర్శకుడు శ్రీ కుమార్‌మీనన్ మోహన్‌లాల్‌గారిని 35 సంవత్సరాల వయస్సున్న వైవిధ్యమైన పాత్రలో చూపించనున్నారు. దీనికోసం మోహన్‌లాల్‌గారు యోగాసనాల వంటి ప్రక్రియలు 55 సంవత్సరాల వయస్సులో చేయడం హ్యాట్సాఫ్. పీటర్ హెయిన్స్ యాక్షన్, అద్భుతమైన గ్రాఫిక్స్ మెస్మరైజ్ చేస్తాయి. ఈ సినిమా హక్కులు మాకు ఇచ్చినందుకు మోహన్‌లాల్‌గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మలయాళంతోపాటు తెలుగులోనూ ఏక కాలంలో డిసెంబర్ 14న అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నాం అని అన్నారు.