విలన్‌గా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెరీర్ ప్రారంభం నుండి భిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనదైన ఇమేజ్‌ని సంపాదించుకున్నాడు మెగా హీరో వరుణ్‌తేజ్. ముకుందతో జర్నీ మొదలుపెట్టిన వరుణ్, ప్రతి సినిమా విభిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. తాజాగా మొదటి తెలుగు స్పేస్ చిత్రంగా తెరకెక్కుతున్న అంతరిక్షం సినిమాలో నటిస్తున్న ఆయన, ఓ నెగెటివ్ పాత్రలో నటిస్తాడని వార్తలొస్తున్నాయి. ఆ వివరాల్లోకెళితే.. తమిళంలో మంచి విజయం సాధించిన ‘జిగర్ తాండా’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు హరీశ్ శంకర్. సిద్ధార్థ్ హీరోగా నటించగా, బాబీ సింహ నెగెటివ్ పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. హీరో పాత్రకంటే విలన్ పాత్రకే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. దిల్ రాజు ఈ హక్కులు సొంతం చేసుకున్నారు. అయితే, నెగెటివ్ షేడ్‌లో వరుణ్‌తేజ్‌ని నటింపజేయాలని హరీశ్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు. భిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వరుణ్‌తేజ్, విలన్ పాత్రకు ఓకె చెబుతాడా లేదా అనేది చూడాలి!