షకీలా.. బంగారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షకీలా. ఒకప్పటి శృంగార తార. ఏ టాగ్‌లైన్‌తో పెద్ద హీరోల చిత్రాలకు సైతం సవాల్ విసిరిందో, ఇప్పుడు ఆ టాగ్‌లైన్‌కు వ్యతిరేకంగా బయోపిక్ పోస్టర్లలో దర్శనమిస్తోంది. ఆ టాగ్‌లైన్ -పోర్న్ స్టార్ కాదన్నది. తన మార్క్ అడల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో ఒక వెలుగు వెలిగిన నటి -షకీలా. ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో షకీలా పాత్రను బాలీవుడ్ నటి రిచా చద్దా చేస్తోంది. ‘లవ్ యు అలియా’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ షకీలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మేజిక్ సినిమాస్, యోధాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే సినిమా టైటిల్ లోగోను విడుదల చేసిన యూనిట్, మంగళవారం షకీలా లుక్‌ను షేర్ చేసింది. ‘ఆమె.. బంగారం’ అన్న అర్థం వచ్చేలా.. ఒళ్లంతా నగలతో దర్శనమిస్తోంది షకీలా (రిచా చద్దా). టైటిల్ పక్కనే ‘పోర్ట్ స్టార్ కాదు’ అన్న క్యాప్షన్ స్పెషల్ అట్రాక్షన్. 2019 వేసవిలో ఈ చిత్రాన్ని థియేటర్ల తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు నిర్మాతలు.
మల్లూ ఆంటీగా మలయాళ చిత్రాల్లో ఎక్కువ కనిపించిన షకీలా, తెలుగు, తమిళం, కన్నడ భాషా చిత్రాలు సహా మొత్తం దక్షిణ చిత్రసీమనే ఒకతరహా పాత్రలతో మెప్పించారు. ఆమె సినిమాలు విదేశీ భాషల్లోకీ అనువాదమయ్యాయంటే -అప్పట్లో ఆమె క్రేజ్‌ను అంచనా వేయొచ్చు. అయితే ఆమె వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్న తరువాత -స్క్రీన్‌లైఫ్ కంటే నిజ జీవితానే్న ఎక్కువభాగం తెరకెక్కించినట్టు దర్శకుడు ఇంద్రజిత్ చెబుతున్నారు. ఆ అర్థం వచ్చేలా ‘ఆమె.. బంగారం’ అన్న సింబాలిక్ పోస్టర్‌ను విడుదల చేయడం గమనార్హం.