తెలివైన పనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు శంకర్ సినీ కెరీర్‌లోనే అతి పెద్ద నిడివి సినిమా -ఐ. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం రన్‌టైం 188 నిమిషాలు. శంకర్ మార్క్ స్పష్టంగా కనిపించినా -ఆడియన్స్‌కి ఎక్కలేదు. ఎందుకంటే -అంతసేపు కూర్చుని సినిమాని ఎంజాయ్ చేసేంత ఓపిక ఆడియన్స్‌కి లేకపోవడం. ఇది చాలా చిన్న విషయమే కావొచ్చు, కానీ ఓ సినిమా సక్సెస్‌ను నిర్ణయించే అంశమే. అందుకే ఈసారి శంకర్ కాస్త జాగ్రత్తపడ్డాడు. తన కెరీర్‌లోనే అత్యంత తక్కువ నిడివి సినిమాను ఆడియన్స్ మీదకు ప్రయోగిస్తున్నాడు. అదే -రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన 2.వో. ఈ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు రానున్న చిత్రం -సెన్సార్ నుంచి యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. సెన్సార్ సర్ట్ఫికెట్‌లోని లెక్కల ప్రకారం చిత్రం రన్‌టైం -2.28 గంటలు. అంటే 148 నిమిషాలు. నిజానికి శంకర్ సినిమాల రన్‌టైం సాధారణ చిత్రాలకంటే పిసరంత ఎక్కువే ఉంటాయి. అంతకుముందు రజనీకాంత్‌తో తీసిన రోబో మూవీ రన్‌టైం 167 నిమిషాలు. అత్యద్బుత గ్రాఫిక్స్‌తో కథ చెప్పడానికి సిద్ధమైన శంకర్ -ఈసారి విజువల్ వండర్ రన్‌టైంను బాగా తగ్గించాడన్న చర్చ సాగుతోంది. ట్రైలర్‌తో సంభ్రమాశ్చర్యాల అనుభూతి కలిగించిన శంకర్, ఈసారి ప్రేక్షకుడిని విసిగించకుండా తక్కువ నిడివితో కథ చెప్పడానికి ప్రయత్నించడం వెనుక పెద్ద థియరీయే ఉందన్న చర్చ మొదలైంది. బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ విలన్ పాత్ర పోషిస్తుంటే, అమీజాక్సన్ హీరోయిన్‌గా వస్తున్న రోబో సీక్వెల్ 2.వో నిర్మాణానికి లైకా ప్రొడక్షన్స్ రూ.550 కోట్లు వెచ్చిందన్న సమాచారం ఇప్పటికే అంచనాలు, ఆసక్తుల్ని పీక్స్‌కు తీసుకెళ్లడం తెలిసిందే.