సరైన పాత్రలో పూర్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్ణ ప్రధాన పాత్రలో గౌరికృష్ణ నిర్మిస్తోన్న చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మొదలైంది. అన్నం చిన్నికృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాటల రచయిత మరుధూరి రాజా ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా నిర్మాత తండ్రి ఇ.రమేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. నిర్మాత గౌరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు చెప్పిన కానె్సప్ట్ నచ్చి తొలిసారిగా సినిమా నిర్మిస్తున్నానని, పూర్ణ అయితే పర్‌ఫెక్ట్ యాప్ట్ అని భావించి ఆమెను తీసుకున్నాం అన్నారు. సినిమాటోగ్రాఫర్‌గా బాల్‌రెడ్డి, భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్‌లో కంప్లీట్ చేసి సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. దర్శకుడు చిన్నికృష్ణ మాట్లాడుతూ ఇది తన తొలి సినిమా అని, పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్ వున్న పాత్ర కావడంతో పూర్ణను తీసుకున్నామన్నారు. మంచి సినిమా ప్రేక్షకులకు అందిస్తున్నామన్నారు. నటి పూర్ణ మాట్లాడుతూ ఇందులో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నారు. సంగీత దర్శకుకడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ పూర్ణ లీడ్ రోల్ చేస్తున్న చిత్రానికి మ్యూజిక్ చేస్తుండటం హ్యాపీగా ఉందన్నారు. సినిమా విషయంలో దర్శకుడు క్లారిటీతో ఉన్నాడని, మ్యూజిక్ విషయంలో నిర్మాత కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీగా రావడానికి సహకరిస్తున్నారని వివరించారు.