వేగంపెంచిన జెర్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవదాస్ చిత్రం తరువాత నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల మొదటి షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నిన్నటినుండి రెండో షెడ్యూల్‌ను స్టార్ట్ చేసుకుంది. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని క్రికెటర్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటి శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. నాని మొదటిసారి డిఫరెంట్ జోనర్‌లో నటిస్తుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.