వచ్చే 16న ఎన్టీఆర్ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ అగ్ర హీరో బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక ఈ చిత్రం యొక్క ఆడియో వేడుక డిసెంబర్ 16న తిరుపతిలో గ్రాండ్‌గా జరుగనుందని సమాచారం. ఈ వేడుకకు సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావుగారి నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్నది. దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపించనున్నారు. విద్యాబాలన్, సుమంత్, నిత్యమీనన్, రకుల్‌ప్రీత్‌సింగ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. ఎన్‌బికె ఫిలిమ్స్, వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.