తెలుగులోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ నటి విద్యాబాలన్ మంచి నటి అన్న విషయం తెలిసిందే. ‘నోవన్ కిల్‌డ్ జెస్సికా’, ‘డర్టీ’ పిక్చర్స్ సినిమాల్లో మంచి నటన ప్రదర్శించారు. ఆ తరువాత 2012లో వచ్చిన ‘కహానీ’ తనని నటిగా మరో మెట్టు ఎక్కించింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కహానీ-2’ అనే సినిమాని రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగం ఎక్కడ ముగిసిందో అక్కడనుండే సీక్వెల్ మొదలవుతుందని సమాచారం. విద్యాబాలన్ నటించిన ‘కహానీ’ని నయనతార హీరోయిన్‌గా ‘అనామిక’ పేరుతో తెలుగులోనూ, తమిళ్‌లోనూ శేఖర్ కమ్ముల రీమేక్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు విద్యాబాలన్ నటిస్తున్న ‘కహానీ-2’ని హిందీతో కలిపి తెలుగు, తమిళ్ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. విద్యాబాలన్‌కి దక్షిణాదిన ఉన్న క్రేజ్ దృష్ట్యా దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు.