సునీల్ కొత్త సినిమా ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రాంతిమాధవ్ లాంటి సెన్సిబుల్ డైరెక్టర్‌తో సునీల్ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందని దర్శకుడు వి.వి.వినాయక్ తెలిపారు. సునీల్, మియా జంటగా యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిటెడ్ పతాకంపై క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పరుచూరి కిరీటి నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు కెమెరా స్విచ్చాన్ చేయగా, డి.సురేష్‌బాబు క్లాప్‌కొట్టారు. క్రాంతిమాధవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో సునీల్ మాట్లాడుతూ- రెండు గంటలు సినిమా కథ విన్న తురవాతే సినిమా చేయడానికి అంగీకరించాం. మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసుకొని సెట్స్‌మీదకు వెళ్తున్నామని, తన కెరీర్‌లో పెద్ద హిట్ సినిమా అవుతుందని సునీల్ చెప్పారు. ఓ మంచి కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి కాస్త గ్యాప్ తీసుకున్నాను. ఈ సినిమాకు సునీల్ హీరో అయితే యాప్ట్ అవుతుందని ఆయనకు కథ చెప్పి ఓకే చేయించుకున్నాను. సునీల్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో కామెడీ కొత్తగా ఉంటుందని దర్శకుడు క్రాంతిమాధవ్ అన్నారు. సునీల్‌గారికి కథ బాగా నచ్చడంతో సినిమా మొదలుపెట్టాం. ఆయనతోపాటు టీం అందరికీ మంచి పేరు రావాలని నిర్మాత పరుచూరి కిరీటి చెప్పారు.
సునీల్, మియా, సంపత్, అలీ, ఆశిష్ విద్యార్థి, వెనె్నల కిషోర్, వృధ్వీ, సుబ్బరాజు, దువ్వాసి మోహన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్:జిబ్రాన్, ఆర్ట్ డైరెక్టర్:ఎ.యస్.ప్రకాష్, ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వరరావు, డైలాగ్స్:చందర్‌మోహన్ చింతాద, నిర్మాత:పరుచూరి కిరీటి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:క్రాంతిమాధవ్.