నిర్మాత జయకృష్ణ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిరుచిగల నిర్మాతగా ‘మనవూరి పాండవులు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘సీతారాములు’, ‘కృష్ణార్జునులు’, ‘వివాహ భోజనంబు’ వంటి చిత్రాలను రూపొందించిన మేకప్‌మెన్, నిర్మాత జయకృష్ణ మంగళవారం తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. మేకప్‌మన్ అప్రెంటిస్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన నిర్మాతగా ఎదిగి ఉత్తమమైన చిత్రాలను రూపొందించారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి దగ్గరలోని కోమర్రు గ్రామంలో 1941 ఆగస్టు 18న ఓ ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన జయకృష్ణ కృష్ణంరాజు, జయప్రదలకు పర్సనల్ మేకప్‌మన్‌గా పనిచేశారు. కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడు ఒకే రోజులో అనేక చిత్రాలకు మేకప్‌మన్‌గా పనిచేస్తూ బిజీగా వుండేవారు. జయకృష్ణ మూవీస్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి మంచి చిత్రాలను రూపొందించారు. ఆయన రూపొందించిన చివరి చిత్రం దాసు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువురు చిత్ర ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.