బాధ్యత నాదే: అమీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యకాలంలో అతి పెద్ద డిజాస్టర్ అంటే థగ్స్ ఆఫ్ హిందూస్టాన్ అంటూ బాలీవుడ్ మీడియా నుండి కథనాలు వస్తున్నాయి. దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో రూపొందిన చిత్రం కనీసం 100 కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయిందనే టాక్ టాలీవుడ్‌వర్గాల్లో వినిపిస్తోంది. మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ ఇటీవలికాలంలో వరుసగా మంచి చిత్రాలతో బాలీవుడ్ టాప్ కలెక్షన్స్‌ను సాధించాడు. కానీ ఈ చిత్రం మాత్రం ఆయన కెరీర్‌లోనే మాయని మచ్చ అంటూ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అమీర్‌ఖాన్‌తోపాటు అమితాబ్‌బచ్చన్ కూడా ఉండటంతో డబుల్‌హిట్ అవుతుందని, సునాయాసంగా బాహుబలి వసూళ్లను క్రాస్ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశించారు. కాని థగ్స్ తీవ్రంగా నిరాశపర్చింది. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనంతో విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత మొదటిసారి అమీర్‌ఖాన్ సినిమా ఫ్లాప్ గురించి స్పందించాడు. సినిమా ఫ్లాప్‌కు పూర్తి బాధ్యత తానే వహిస్తానంటూ ప్రకటించాడు. ప్రేక్షకులను అలరించేందుకు పూర్తిగా ప్రయత్నించాం కానీ అనుకున్నది సాధ్యంకాలేదు. మేం ఏదైనా అనుకున్నామో అది తీశాం కాని అది ప్రేక్షకులు తిరస్కరించారు. కొంతమంది సినిమా నచ్చిందని అన్నారు. వారికి నా కృతజ్ఞతలు చెబుతున్నాను అన్నారు. థగ్స్ ఫ్లాప్‌కు తానే కారణమని ఒప్పుకుని సారీ చెప్పిన అమీర్‌ఖాన్, మరి డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను భరించేందుకు ముందుకు వస్తాడా అనేది చూడాలి!