ఇటు వినాయక్‌తో అటు బోయపాటితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచేస్తున్నాడు. బాలయ్య హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో సి కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం ప్రకారం మార్చి రెండోవారంలో వినాయక్- బాలయ్య సినిమా మొదలవ్వనుందని తెలుస్తోంది. వీరి కాంబినేషన్‌లో గతంలో ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రం వచ్చింది. మళ్ళీ 16 ఏళ్ళ తరువాత ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి వారి అంచనాలను ఈ కాంబినేషన్ రీచ్ అవుతుందో లేదో చూడాలి.
అయితే బాలయ్య ఇటు వి.వి.వినాయక్ సినిమా చేస్తూనే.. అటు సమాంతరంగా బోయపాటి శ్రీనుతో కూడా ఓ సినిమా చెయ్యటానికి ప్లాన్ చేశారట. మొత్తానికి ఫిఫ్టీప్లస్‌లో కూడా బాలయ్య యంగ్ హీరోలుకంటే స్పీడుగా సినిమాలు చేస్తుండటం.. నిజంగా బాలయ్యకి నటనపై ఉన్న అంకితభావమే కారణమని చెప్పాలి. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌తో బిజీగా ఉన్నారు. జనవరి మొదటి వారానికి ఆ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం బాలయ్య పూర్తి చేయనున్నారు.