మీలానే నేనూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్.. ఆ పేరుకు నిర్వచనం రజనీకాంత్. యస్.. సూపర్‌స్టార్ అంటే రజని. రజని అంటే సూపర్‌స్టార్. ఆయన స్టైల్ మాస్ ఆడియన్స్‌కి కెవ్వు కేక. కేవలం దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలోనూ ఓ రేంజ్ ఫాలోయింగ్. దానికి సింపుల్ ఎగ్జాంపుల్.. బాలీవుడ్ బాద్షా షారుఖ్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో రజనీ కోసం స్పెషల్‌గా లుంగిడాన్స్ పాటను పెట్టించడమే. అలాంటి ఫాలోయింగ్ వున్న సూపర్‌స్టార్ రజనీ, హిట్టు మూవీ రోబోకి సీక్వెల్‌గా 2.ఓలో నటించారు. సినిమా 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్ వచ్చిన రజనీ చెప్పిన విశేషాలు.

టెక్నీషియన్స్‌లో శంకర్ శంకరే..
రోబోని ఆయన డీల్ చేసిన విధానం మనం చూశాం. ఆ రోబోతో పోల్చుకుంటే 2.ఓ టైంకి శంకర్‌లో కాన్ఫిడెన్స్ లెవల్స్ బాగా పెరిగాయి. ముఖ్యంగా విదేశీ నిపుణులను డీల్ చేసే విషయంలోగాని, వారి నుంచి వర్క్ తీసుకోవడంలోగాని శంకర్‌లో పరిపక్వత కనిపించింది. ఒక గొప్ప టెక్నీషియన్ శంకర్‌లో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాడు.
కాస్త టెన్షన్ పడ్డాడు
కొన్ని సినిమాలకు ఈ ఇబ్బంది తప్పదు. దర్శకుడికి అది కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ నా ముందెప్పుడూ అలా కనిపించలేదు. టెన్షన్ పడుతున్నాడన్న విషయాన్ని విన్నానంతే. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివర్లో అంటే విఎఫ్‌ఎక్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయ. శంకర్ అనుకున్నట్టుగా వీఎఫ్‌ఎక్స్ రాలేదు. అదే టెన్షన్‌కి కారణమై ఉంటుంది. చివరకు అతను పూర్తి సంతృప్తి చెందేలా వీఎఫ్‌ఎక్స్ అవుట్‌పుట్ వచ్చింది.
ఛాలెంజింగ్ అన్నదే లేదు
ఈ ప్రాజెక్టును ఛాలెంజింగ్‌గా ఫీలవ్వలేదు. అలాంటి భావన రోబో టైంలో ఉంది, కాదనలేను. ఆ ప్రాజెక్టుకి ఆ ఇబ్బంది ఎందుకంటే -ఆ టైప్ ఆఫ్ యాక్షన్ మొదటిసారి చేసింది అందులోనే. ఇక 2.ఓకి ఆ పరిస్థితి లేదు. కారణం దర్శకుడు శంకర్. ఆయనిచ్చిన సలహాలు పాటించి సినిమాలో నటించానంతే.
ఆసక్తికరమైన కథ
ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో, నేనూ అలానే ఎదురు చూస్తున్నా. ఎందుకంటే సినిమాలో 45 శాతం గ్రాఫిక్సే. అందుకే నాక్కూడా సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఉంది. దీనికితోడు అద్భతమైన కథా ఉంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు వున్న సినిమా అయినా, దాన్ని నడిపించేది కథ. అలాంటి కథవున్న ఈ సినిమా సూపర్‌హిట్ గ్యారంటీ. ఇక ఇప్పటికే ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న సినిమాకు అసలు ప్రమోషనే అవసరం లేదు. ఇప్పటికే టిక్కెట్లు అయిపోయాయట.
అక్షయ్‌కుమార్‌తో..
అక్షయ్‌కుమార్ హార్డ్ వర్క్ ఎంతో గొప్పది. అతనుతప్ప ఇంకెవరూ చెయ్యలేరు. సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చిందంటే దానికి ప్రధాన కారణం అక్షయ్. అదేవిధంగా సంగీత దర్శకుడు రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.
నా మొదటి సినిమాలా..
తెలుగు ప్రేక్షకులు చాలా మంచివాళ్లు. అందుకే తెలుగువాళ్లని అంతా ఇష్టపడతారు. తెలుగు గొప్పతనాన్ని మహాకవి భారతే గొప్పగా మెచ్చుకున్నారు. ఇక ఈ సినిమా కోసం మీలాగే నేనూ ఎదురుచూస్తున్నా. 1975లో నటించిన అపూర్వాంగళల్ చిత్రాన్ని చూడాలని ఎంత ఆసక్తిగా ఎదురు చూశానో.. మళ్లీ ఇనే్నళ్ల తరువాత 2.ఓ చిత్రం కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

-శ్రీనివాస్ ఆర్.రావ్