న్యూ ఏజ్ లవ్ స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవింద్‌రెడ్డి, శుభంగి పంత్, అజిత్ రాధారాం, దీక్షిత హీరో హీరోయిన్లుగా తీర్థసాయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘నీకోసం’. రీ ఫ్రెషింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రంతో అవినాష్ కోకటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అల్లూరమ్మ (్భరతి) నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాకు సోమశేఖరరెడ్డి, అల్లూరి రెడ్డి సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రేమలోని భిన్నమైన కోణాలను స్పృశిస్తూ రూపొందుతున్న సినిమా టీజర్ రిలీజైంది. టాకీపార్ట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వున్న చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దర్శకుడు అవినాష్ కోకటి మాట్లాడుతూ ఈమధ్య వస్తున్న ప్రేమకథలకు భిన్నంగా ఉంటుంది నీ కోసం. రెండు ప్రేమ జంటల కథలను ఇందులో డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నాం. న్యూఏజ్ లవ్‌స్టోరీ అని చెప్పొచ్చు. ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అన్నారు.