కొత్తగా.. 24 కిస్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిల్లీ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అరుణ్ అదిత్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘24 కిస్సెస్’. అయోధ్యకుమార్ కృష్ణం శెట్టి దర్శకుడు. సంజయ్‌రెడ్డి, అనిల్ పల్లాల, అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి నిర్మాతలు. నవంబర్ 23న ఈ సినిమా విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతోన్న సందర్భంగా ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్‌లో దర్శక నిర్మాత అయోధ్యకుమార్ మాట్లాడుతూ- ప్రేక్షకులకు థాంక్స్. నైజాం సహా ఇతరప్రాంతాల్లో కలెక్షన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మిణుగురులు ఎలా తీశామో, ఈసినిమాను కూడా అంతే జెన్యూన్‌గా తీశాం. టైటిల్ ఎందుకు పెట్టాలో అర్థమయ్యే వుంటుంది. పబ్లిసిటీ కోసం ఏదీ చేయలేదు. మా అమ్మతో కూర్చుని తొలి ఆట చూశాను. అలాగే మహిళా మండలి నుండి మరో ఇద్దరు కూడా ఆ షో చూశారు. ఎవరూ ఏమీ అనలేదు. సినిమాలో అశ్లీలం ఉందని ఎవరూ ఒప్పుకోరు. సినిమాలో చూపించిన ముద్దు కూడా పొయెటిక్ బ్యాక్‌డ్రాప్‌లోనే వుంటుంది. సినిమాలో ల్యాగ్ అయిన సన్నివేశాలను ఎడిట్ చేశాం. థియేటర్స్‌తోపాటు.. డిజిటల్ మీడియాలో లేటెస్టు వెర్షన్‌ను అప్‌లోడ్ చేస్తున్నాం. మంచి అభిప్రాయాలను తీసుకుని ఎడిట్ చేశాం. రేపు టీవీలో వచ్చిన తర్వాత ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది అన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ- సినిమాలో రెండు మూడు థీమ్స్ ఉన్నాయి. సినిమా ప్రమోషన్‌లో ముద్దుల గురించే సినమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇదొక పొయెటిక్ సినిమా. ప్రమోషన్స్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలనిపించింది అన్నారు.