రాజకీయాలవైపు వెళ్లను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్.. టాలీవుడ్‌లో ఆయనది ప్రత్యేక శైలి. సోలో హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీకాంత్.. అటు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘ఆపరేషన్ 2019’, బివేర్ ఆఫ్ పబ్లిక్.. అనేది ఉపశీర్షిక. అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌కుమార్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. ఈసినిమా డిసెంబర్ 1న విడుదలవుతున్న సందర్భంగా హీరో శ్రీకాంత్‌తో ఇంటర్వ్యూ..

ఆసక్తికరంగా..

రైతు కుటుంబంలో పుట్టిన ఓ అబ్బాయి విదేశాలకు వెళ్లి సంపాదించి, తన రాష్ట్రంలో రైతులకు ఎలా సాయపడ్డాడు? సాయపడాలని ముందుకొచ్చిన అతనికి రాజకీయ నాయకుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? ఇతను రాజకీయాల్లోకి వచ్చి ఏం చేశాడు? లాంటి ఆసక్తికర అంశాలతో కథ సాగుతుంది. ప్రజలది కూడా తప్పుందని చెప్పే ప్రయత్నం చేశాం. అంటే, ఆలోచించమని చెప్పడమన్నమాట. దానివల్ల జనాల్లో ఆలోచన పెరుగుతుంది. దానికి తగ్గ డైలాగులూ ఉన్నాయి. దేశానికి ఒక జాతీయ గీతం ఉన్నట్టే, మతానికి, కులానికి కూడా గీతాలు పుట్టుకొస్తాయని చెప్పాం. ఇది ఎంతవరకు కాంట్రవర్సీ అవుతుందో తెలియదు. ఇందులో ఏ పార్టీని తిట్టలేదు. ఏ పార్టీని గురించి విమర్శించలేదు.
బివేర్ ఆఫ్ పబ్లిక్..
ఆడియెన్స్ కూడా ఆలోచించాలి అని అలా పెట్టాం. ఓట్లు వేయడానికి ముందు ఆడియన్స్ కూడా ఆలోచించాలి. రాజకీయ నాయకులు ఎలా స్పందిస్తున్నారు, ఓటర్లకు ఎలా డబ్బులు పంచుతున్నారు? వంటివన్నీ చెప్పాం. ప్రజలు జాగ్రత్తపడకుంటే చాలా నష్టపోతారని చెప్పాము. అయితే సినిమాలు చూసి ఎవరూ మారరు. పైగా మెసేజ్ ఇస్తామంటే ఎవరు తీసుకుంటారు చెప్పండి. కానీ జస్ట్.. ఇలా జరుగుతుంది అని వారికి తెలియజెప్పాలనే ఈ ప్రయత్నం.
నెగెటివ్ టచ్..
ఈ సినిమాలో రైతులకు ఏమి చేస్తాము అన్నది సినిమాలో చూడాలి. ఆపరేషన్ దుర్యోధనలో ఉన్నట్టు ఇందులోనూ కొన్ని ఉంటాయి. కేరెక్టర్ కాస్త నెగెటివ్‌గా ఉంటూ, పాజిటివ్‌గా మారుతున్నట్టు అనిపిస్తుంది.
ఎన్నికల కోసమే..
2019లో ఎన్నికలు కదా.. వాటిని ఉద్దేశించే మేం ఈ సినిమా చేశాం. కానీ తెలంగాణలో కాస్త ముందుగా రావడంతో ఇపుడు విడుదల చేస్తున్నాం.
మనోజ్, సునీల్..
మనోజ్ చాలా ముఖ్య పాత్ర చేశారు. సునీల్ పాత్ర కూడా బావుంటంది. మనోజ్ పోలీసాఫీసర్‌గా మెప్పిస్తాడు. మిగిలినవి తెరమీద చూడాల్సిందే. అలాగే హీరోయిన్‌ని కిల్లింగ్ వీరప్పన్‌లో చేసిన అమ్మాయిని తీసుకున్నాం. తను చూడ్డానికి హోలీగా ఉంది. సినిమాలో హీరోయిన్‌కి పెద్ద ప్రాముఖ్యత ఏమీ లేదు. కాకపోతే భార్యగా నటించింది.
సెలెక్టివ్‌గా..
సినిమాలాను ఎంచుకుని సెలెక్టివ్‌ఘా చేయడం లేదు. మంచి పాత్ర అంటే తప్పకుండా చేస్తా. హీరోగానూ, విలన్‌గానూ.. ఎలాగైనా చేస్తా. మరీ ఫాదర్ వేషాలు వేసేంత వయసైతే ఇంకా రాలేదనుకోండి.
టెన్షన్ తీసుకోను
చాలామంది అడుగుతుంటారు.. నేను ఏ టెన్షన్సూ తీసుకోను. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్ చేయడం నాకు బాగా తెలుసు. అందుకే కాస్త ఫ్రెష్‌గా కనిపిస్తా. ఈమధ్య మూడు కిలోలు తగ్గా.
ఎవరి సినిమా వారిదే..
రజనీ రోబో 2.0 సినిమా విడుదల అవుతోంది. పెద్ద సినిమా ఉండనివ్వండి.. ఉంటే ఏమవుతుంది? ఇంతకుముందు కూడా ఇలాంటి చాలాసార్లు జరిగాయి. ఏది బావుంటే అది ఆడుతుంది. అయినా రోబో 2.0 సినిమా తరువాత రెండు రోజులకు వస్తున్నాం.
మా అసోసియేషన్ విషయంలో..
తప్పు చేస్తే భయపడాలండీ.. చేయనప్పుడు నాకు టెన్షన్ ఎందుకు? నిజంగా తప్పుచేసిన రోజు సారీ చెప్పడానికి కూడా నేనేమీ వెనుకాడను. అయినా అక్కడ జరిగింది వేరు.
తదుపరి చిత్రాలు..
వరుసగా చాలానే ఉన్నాయి. ‘తెలంగాణ దేవుడు’, ‘మార్షల్’.. ఉన్నాయి. ఈమధ్య రాజకీయ నేపథ్యం వున్న సినిమాలు ఎక్కువగా చేస్తున్నానని రాజకీయాల్లోకి వస్తారని అంటున్నారు.. నాకు అలాంటి ఉద్దేశ్యం ఏమీ లేదు.. కాకపోతే రాజకీయాల గురించి తెలుసుకోవడం పౌరుడిగా మన బాధ్యత.

-శ్రీనివాస్ ఆర్.రావ్