రవితేజతో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియాంక జవాల్కర్ మొత్తానికి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసి టాక్సీవాలా అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఆ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్‌హిట్ టాక్‌ని సొంతం చేసుకోవడంతో తెలుగు పిల్లగా ఇమేజ్ తెచ్చుకున్న ప్రియాంకకు అనూహ్యమైన క్రేజ్ దక్కింది. తాజాగా ఆమె మాస్ రాజా సరసన నటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని ఆయన అభిమానులను నిరాశపరిచింది. గత రెండు చిత్రాల పరాజయాలకి ఈ సినిమా కూడా తోడుకావడంతో ఆయన డీలా పడిపోయాడు. దీంతో ఆయన తన తదుపరి సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రవితేజ తదుపరి చిత్రం వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఉండనుంది. ఈ సినిమాలో కథానాయికలుగా పాయల్ రాజ్‌పుత్‌ను, నాభా నటేశ్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆర్‌ఎక్స్ 100తో పాయల్ రాజ్‌పుత్, సమ్మోహనంతో నాభా నటేశ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల విడుదలైన టాక్సీవాలా సినిమాతో ప్రియాంక జవాల్కర్‌కి యూత్‌లో క్రేజ్ పెరిగింది. అందువలన రవితేజ సూచనతో ఆమెను సినిమాలో తీసుకోవాలనే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయట. నభా నటేశ్ ప్లేస్‌లో ప్రియాంక జవాల్కర్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయని టాక్.