శరవేగంగా కబాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విక్రమసింహ’, ‘లింగ’ లాంటి రెండు వరుస పరాజయాల తర్వాత రజనీకాంత్, తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన ‘కబాలి’, ‘రోబో 2.0’ సినిమాలను సిద్ధం చేస్తున్నారు. రజనీ కెరీర్‌లో బాక్సాఫీస్ పరంగా ప్రభంజనం సృష్టించిన ‘రోబో’కి సీక్వెల్‌గా రోబో 2.0 కాగా, రియలిస్టిక్ సినిమాలతో తమిళనాట సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రంజిత్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌స్టర్ సినిమా ‘కబాలి’. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా పూర్తిచేసుకున్న కబాలి సినిమా ప్రస్తుతం చిన్న చిన్న ప్యాచ్‌వర్క్ పూర్తిచేస్తోంది.
ఏప్రిల్ ఒకటికల్లా ఈ వర్క్ కూడా పూర్తికానున్నట్లు తెలుస్తోంది. ఇక మరోప్రక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతూనే ఉన్నాయి. ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో అంతటా విపరీతమైన అంచనాలు రేకెత్తించిన ‘కబాలి’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం కూడా టీమ్ భారీ ప్లాన్స్ గీస్తోంది. ఏప్రిల్ 14న టీజర్ రిలీజ్‌తో మొదలయ్యే ఈ ప్రమోషన్స్ ఆ తర్వాత నెల రోజులపాటు అదే జోరులో సాగనున్నాయి. ఇక తమిళనాడు సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.