కనకం 916 కేడియమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ మోహన్ భగత్ హీరోగా ఎల్‌ఆర్ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణరావు బూరగాపు నిర్మిస్తోన్న చిత్రం ‘కనకం 916 కేడియమ్’. రాకేష్ పోతాప్రగడ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వైశాఖి బోనం హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. రచయిత పరుచూరి గోపాలకృష్ణ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా, చిత్ర నిర్మాత లక్ష్మణరావు బూరగాపు కెమేరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ దర్శకులు ఎస్‌వి కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, ప్రముఖ నిర్మాతలు బివియస్‌ఎన్ ప్రసాద్, రాజ్ కందుకూరి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాత్రికేయుల సమావేశంలో నిర్మాత లక్ష్మణరావు బూరగాపు మాట్లాడుతూ.. రాకేష్ ఓ రోజు వచ్చి కనకం స్టోరీ లైన్ చెప్పాడు. నచ్చడంతో సినిమా మొదలెట్టాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందన్నారు. దర్శకుడు రాకేష్ పోతాప్రగడ మాట్లాడుతూ పలు చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేశాను. ఆ అనుభవంతో తొలిసారిగా డైరెక్షన్ చేస్తున్నా. పల్లెటూరి నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. డిసెంబర్ 26నుంచి షెడ్యూల్ ప్రారంభిస్తాం. రెండు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తిచేస్తాం. నన్ను నమ్మి అవకామిచ్చిన నిర్మాతకు ధన్యవాదాలు’ అన్నారు. హీరో మోహన్‌భగత్ మాట్లాడుతూ ‘కేరాఫ్ కంచరపాలెం చిత్రంతో నటుడిగా మంచి పేరొచ్చింది. సినిమా తర్వాత ఒక మంచి కథ. కథనాలతో వచ్చి మా దర్శక నిర్మాతలు కలిసారు. వీరి పాషన్ నచ్చి ఈ సినిమా చేస్తున్నా’ అన్నారు. హీరోయిన్ వైశాఖి బోనం, సంగీత దర్శకుడు రాయల్ రాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నవీన్ సాగర్ గోరింట తదితరులు పాల్గొన్నారు. సంపూర్ణేష్‌బాబు, సీనియర్ నరేష్, పోసాని, జీవా, రవిబాబు, శివసూర్య, దేవీప్రసాద్, దీక్షితులు తదితరులు మిగిలిన పాత్రల్లో నటిస్తున్నారు.