జయసుధగా.. పాయల్ రాజ్‌పుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ ఎన్టీఆర్ సినిమా కెరీర్ గురించి మాట్లాడుకుంటే -జయప్రద, జయసుధ ప్రస్తావన లేకుండా సాగించలేం. అందుకే -ఎన్టీఆర్ కథ బయోపిక్‌గా తెరకెక్కుతుందన్న సమాచారం బయటకు రాగానే -ఆ రెండు పాత్రలు ఎవరు చేస్తారబ్బా అన్న ఆసక్తి కనిపించింది. ఎన్టీఆర్‌తో హిట్టు సినిమాలు అందుకున్న మరో ప్రముఖ నటి, దివంగత శ్రీదేవి పాత్రలో ఎలాగూ రకుల్‌ను ఎంపిక చేసేశారు. తాజాగా ఈ ప్రతిష్టాత్మక సినిమాలో జయప్రద, జయసుధ పాత్రలు ఎవరు చేయబోతున్నారన్న ఆసక్తి అప్పటినుంచీ మరింత ఎక్కువైంది. అయతే, తాజాగా చిత్ర బృందం ఈ సస్పెన్స్‌కు తెరదించేసింది.
నందమూరి తారకరామారావుతో స్క్రీన్‌ను షేర్ చేసుకున్న మర్చిపోలేని తారలు జయసుధ, జయప్రదల కోసం ఇద్దరు యంగ్ హీరోయన్లను ఎంపిక చేసుకున్నారట. జయసుధ పాత్రకు ఆర్‌ఎక్స్100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చేస్తుంటే, జయప్రద పాత్రలో హన్సిక కనిపించనుంది. వీరి కాంబినేషన్‌లో వచ్చే సీన్లను ముందస్తు ఎన్నికల ప్రచారం తర్వాత చేయనున్నారని సమాచారం. జయప్రదతో ఆనాటి సూపర్ హిట్ సాంగ్ ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ కూడా ఇందులో చూపించే అవకాశాలున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సావిత్రి పాత్రకోసం నిత్యామీనన్, శ్రీదేవి పాత్రకోసం రకుల్ ప్రీత్‌సింగ్‌ను తీసుకున్న విషయం తెలిసిందే.