గానకోకిల సుశీల గిన్నిస్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘గానకోకిల’గా తెలుగువారందరికీ తెలిసిన నేపధ్యగాయని సుశీల తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆరు భాషల్లో 17,695 పాటలు పాడిన గాయనిగా ఆమెకు ఈ అరుదైన ఘనత దక్కింది. 1950లో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె తెలుగుతో పాటు తమిళం, మళయాలం, కన్నడ, హిందీ, బెంగాలీ, ఒరియా, తుళు భాషల్లో పాడి సంగీతానికి ఎలాంటి సరిహద్దులు లేవని నిరూపించారు. సోలో, యుగళ గీతాలకు సంబంధించి ఎక్కువ పాటలు పాడిన గాయనిగా నిలిచారు. కేవలం ఎస్పీ బాలసుబ్రమణ్యంతోనే 1,336 పాటలు పాడినట్లు గిన్నిస్ రికార్డుల సంస్థ గుర్తించింది. సినిమా రంగానికి స్వస్తి పలికిన అనంతరం ఆమె ఎన్నో భక్తిగీతాల ఆల్బమ్‌లను విడుదల చేశారు. విజయనగరం జిల్లాలో జన్మించిన సుశీల ఉత్తమ గాయనిగా అయిదుసార్లు జాతీయ అవార్డులతో పాటు పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. అత్యధిక సంఖ్యలో పాటలు పాడిన గాయనిగా గుర్తిస్తూ ‘గిన్నిస్ రికార్డుల సంస్థ’ ఆమెకు ధ్రువపత్రం అందజేసింది.