కొత్త బంగారు లోకంలోకి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కొత్త బంగారులోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది శ్వేతబసుప్రసాద్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. అయితే అదృష్టం బాగాలేకనే మరేంటో కాని శ్వేతబసు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలం అయ్యింది. తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన శ్వేతబసు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఈ విషయమై స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చేసింది. గత కొన్ని రోజులుగా రోహిత్ అనే వ్యక్తితో శ్వేత ప్రేమలో ఉందట. వీరిద్దరు డిసెంబర్ 13న పూణెలో వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లుకూడా జరుగుతున్నాయి. తాజాగా శ్వేత బసుప్రసాద్ తన స్నేహితులకు బ్యాచిలర్స్ పార్టీ ఇచ్చింది. ఆ పార్టీలో రోహిత్ కూడా పాల్గొన్నాడు. పార్టీలో ఎంజాయ్ చేసిన పిక్స్‌ను శ్వేత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్లుగా శ్వేత ప్రకటించింది. శ్వేతబసు రోహిత్‌ల మధ్య పరిచయం కారణం అనురాగ్ కశ్యప్. బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్‌మేకర్ అయిన అనురాగ్ కశ్యప్ తన ప్రాజెక్ట్‌కోసం వీరిద్దరిని తీసుకున్నాడు. ఆ సమయంలోనే వీరి పరిచయం అయ్యిందట. తన ప్రేమను మొదట శ్వేతబసుప్రసాద్ రోహిత్‌కు గోవాలో చెప్పిందట. కాస్త గ్యాప్ తీసుకున్న రోహిత్ ఆమెకు పూణెలో ఓకే చెప్పాడట. వీరిద్దరి పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం పూణెలో నిర్వహించేందుకు ఇద్దరి కుటుంబ సభ్యులు సర్వం సిద్ధం చేస్తున్నారు.