14న ఇదం జగత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో సుమంత్ నటిస్తున్న వైవిధ్య చిత్రం -ఇదం జగత్. అంజు కురియన్ హీరోయిన్. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి అనిల్ నీలకంఠం దర్శకుడు. నిర్మాణానంతర పనులు ముగింపునకు రావడంతో డిసెంబర్ 14న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు వెల్లడించారు. చిత్ర విశేషాలను మీడియాకు వెల్లడిస్తూ త్వరలోనే సెన్సార్‌ను పూర్తిచేసి డిసెంబర్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు వెల్లడించారు. ప్రామిసింగ్ చిత్రాల హీరో సుమంత్ కెరీర్‌లో ఇప్పటి వరకూ చేయనటువంటి వైవిధ్యమైన పాత్రతో ఈ చిత్రంలో కనిపించనున్నాడు. తొలిసారిగా సుమంత్ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేయబోతున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్‌కు చక్కని స్పందన వచ్చింది. పూర్తి కొత్తదనంతో కూడిన కథ, కథనాలతో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడని, సుమంత్ పాత్ర, కథకు సంబంధించి ఇదం జగత్ టైటిల్ యాప్ట్‌గా ఉంటుందని తెలిపారు. సుమంత్ పాత్ర చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని అన్నారు.