చావాలనుకున్నా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హార్న్ ఓకే ప్లీజ్’ టైంలో నేను ఎదుర్కొన్న లైంగిక వేధింపులతో భయపడిపోయాను. తీవ్ర మనోవేదన అనుభవించాను. ఆ టైంలో చచ్చిపోవాలన్నంత భావన కలిగి కుంగిపోయాను. కానీ, నాకు నేనే ధైర్యం చెప్పుకుని మొండిగా ముందుకెళ్లా’ అంటోంది తనూశ్రీదత్తా. భారత్‌లో మీటూ ఉద్యమం వేళ్లూనుకుందంటే -మాజీ హీరోయిన్ తనూశ్రీ దత్తావల్లే. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పదేళ్ల క్రితం తనపై నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ మీడియా ముందుకొచ్చింది తనూశ్రీ. ఆమెకు అన్ని వర్గాల నుంచి బలమైన మద్దతు లభించడంతో -తామూ లైంగిక వేధింపుల ఎదుర్కొన్నామని, ఎదుర్కొంటూనే ఉన్నామంటూ అనేకమంది బయటికొచ్చారు. అయితే ఉద్యమానికి మద్దతు పలికినవాళ్లే కాదు, వ్యతిరేకించిన వాళ్లూ లేకపోలేదు. ముఖ్యంగా తనూశ్రీని టార్గెట్ చేస్తూ రాఖీసావంత్ చేసిన విమర్శలనూ మర్చిపోలేం. అయితే, సావంత్‌ను తనూశ్రీ సైతం బలంగానే ఎదుర్కొంది. రివర్స్ అటాక్ ఇచ్చింది. మీటూ వంటి మంచి ఉద్యమంలో అంతా భాగస్వాములై లైంగిక వేధింపులు లేకుండా చేయాలన్నది తన విజ్ఞప్తిగా తనూశ్రీ అప్పటినుంచీ చెబుతూనే ఉంది. అనేకమంది మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపులను చెప్పుకునేందుకు భయపడుతున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన తరువాత ఎదురయ్యే అనుభవాలకు ఆందోళన చెందుతున్నారు. గతంలో జియాఖాన్, ప్రత్యూష బెనర్జీ వంటివారు ఇలాంటి పరిస్థితుల వల్లే చనిపోయారు. మహిళల పట్ల మగవాడి ప్రవర్తన మారనంతవరకూ మరో జియాఖాన్, ప్రత్యూషలు చనిపోతూనే ఉంటారు’ అంటూ తనూశ్రీ చెబుతోంది. ఒకదశలో ఉద్యమంలా వెల్లువెత్తిన మీటూ ప్రస్తుతం చల్లారినా -తనూశ్రీ మాత్రం అవకాశం దొరికిన ప్రతిచోటూ మీటూని ప్రస్తావిస్తూనే ఉంది.