విలన్‌గా సిద్ధార్థ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచురల్ స్టార్ నాని హీరో. వైవిధ్యమైన కథలతో చిత్రాన్ని తెరకెక్కించే విక్రమ్‌కుమార్ దర్శకుడు. ఈ ఆసక్తికరమైన కాంబోకి మరో సెనే్సషన్ తోడైంది. అదేంటంటే -హీరో సిద్ధార్థ్ విలన్ పాత్ర పోషించనుండటం. నాని ప్రస్తుతం గౌతమ్ తిన్నసూరి క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న జెర్సీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. జెర్సీలో నాని క్రికెటర్ పాత్ర పోషిస్తుండటం తెలిసిందే. ఇది సెట్స్‌మీద ఉండగానే -మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నాని. మైత్రీ మూవీ మేరక్స్ బ్యానర్‌పై విక్రమ్‌కుమార్ తెరకెక్కించనున్న చిత్రమిది. ప్రస్తుతం ఆ సినిమా ప్రీప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. డిఫరెంట్ జానర్ చిత్రాల్లో నటించడానికి ఆసక్తిచూపే నాని -ఇష్క్, మనంవంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్‌కుమార్‌తో సినిమా ఒకే చేసినప్పుడే ఇండస్ట్రీలో వెరైటీ కాంబో అన్న ఆసక్తి కనిపించింది. నాని కోసమే విక్రమ్‌కుమార్ సిద్ధం చేసిన కథ ఓకే అవ్వడం, ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. జెర్సీ సినిమా షూటింగ్ పార్ట్ పూరె్తైన తరువాత నాని ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడట. ఈ కథకు యంగ్ విలన్ అవసం కావడంతో దర్శకుడు వికమ్, సిద్ధార్థ్‌ను సంప్రదించడం, వెంటనే అతను ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్ధార్థ్, ఆ తరువాత ఆ స్థాయి విజయాలను అందుకోలేక వెనుకపడ్డాడు.
ఇటీవలి కాలంలో తమిళ చిత్రాలకే పరిమితమైన సిద్ధార్థ్, మరోసారి తెలుగు స్క్రీన్‌కు విలన్‌గా రాబొతున్నాడన్న మాట. ఇప్పటికే తెలుగులో యంగ్ విలన్‌గా ఆది పినిశెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే బాటలో పయనించనున్న సిద్ధార్థ్ విలన్‌గా ఎలాంటి ఇమేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.