లవ్‌స్టోరీలే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకుంద సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పూజాహెగ్డే. ఆ మూవీ అంత పెద్దగా వసూళ్లు రాబట్టకపోయినా పూజా నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వెంటనే అమ్మడుకి బాలీవుడ్‌లో కూడా ఛాన్స్ వచ్చింది. అక్కడ మూవీ ప్లాప్ కావడంతో తిరిగి మళ్లీ తెలుగు సినిమాల్లో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన సినిమాలు విజయం సాధించాయి. అల్లు అర్జున్‌తో దువ్వాడ జగన్నాథం, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాల్లో నటించింది. తాజాగా మహేష్‌బాబు నటిస్తోన్న మహర్షి మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఆమె ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది. తనకు ప్రేమ కథలంటే చాలా ఇష్టం అని చెప్పింది పూజా. ప్రస్తుతం పెద్ద హీరోలతో కమర్షియల్ యాక్షన్ చిత్రాలలోనే నటిస్తున్నప్పటికీ నాకు వ్యక్తిగతంగా ప్రేమకథలంటే చాలా ఇష్టమని.. అలాంటి కథలు తనదగ్గరకు వస్తే మాత్రం అసలు వదులుకోనని చెప్పింది.