ఈ ఊపిరి సాహసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో ఈనెల 25న విడుదలైన ‘ఊపిరి’ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. రీసెంట్‌గా సినిమాను చూసిన దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ‘ఊపిరి’ సినిమా గురించి మాట్లాడుతూ ఊపిరి సినిమా చూశాను, చాలా బావుంది. నా మనసుకు ఎంతో నచ్చింది. తెలుగు సినిమా కొత్తతరహా సినిమాలు తీస్తున్నామని చెప్పడానికి ఊపిరి పోసింది. ‘బొమ్మరిల్లు’ తర్వాత నాకు సంపూర్ణంగా నచ్చిన సినిమా లేదు. ఈ పదేళ్లలో ఇంత మంచి మేకింగ్, పెర్‌ఫార్మెన్స్, ఒక డిఫరెంట్ సినిమా అనడానికి అర్థం ఊపిరి. నాతో ఎవరూ ఏకీభవించినా, ఏకీభవించపోయినా తెలుగులో ఇటువంటి సినిమా తీసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. పరిగెత్తి పాటలు పాడి డ్యాన్సులు, ఫైట్స్‌చేసే ఓ హీరోను రెండు గంటలపాటు కుర్చీలో కూర్చోపెట్టి సినిమా తీయడమనేది గొప్ప విషయం. నటుడికి నటించడానికి ఫేస్ కావాలి. కళ్ళతో సినిమాలో నటించవచ్చు అని చెప్పడానికి నిదర్శనమే ఈ చిత్రం. అలాగే కార్తీ గత చిత్రాలను గమనిస్తే యాక్షన్ పంథాలో ఉన్నాయి. అయితే ‘ఊపిరి’ చిత్రంలో తన నటన చూస్తే ఎంత బాగా చేశాడోననిపించింది. దానికి కారణం డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ప్రతి ఫ్రేమ్‌లో డైరెక్టర్ కనపడ్డాడు. ప్రతి క్యారెక్టర్‌ను అద్భుతంగా వౌల్డ్ చేశాడు. చక్కటి ట్రీట్‌మెంట్, ఎక్కడా మెలోడ్రామా లేదు. కథలో క్యారెక్టర్‌పరంగా ఉన్న కామెడీ తప్ప మరేమీ లేదు. అలాగే ఈ సినిమాలో డిఫరెంట్ తమన్నాను చూస్తాం. చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన అనుష్క, శ్రేయ కూడా అద్భుతంగా నటించారు. ఇది టోటల్‌గా డైరెక్టర్స్ ఫిలిం. ఇలాంటి సబ్జెక్ట్ ఒప్పుకోవడం, చేయడం నాగార్జున సాహసం. ఎక్సలెంట్ ఫెర్‌ఫార్మెన్స్ చేశాడు. వీటన్నింటికీ ముఖ్య కారణం గట్స్ ఆఫ్ పివిపి. నాకు తెలిసి పివిపి తప్ప వేరెవరు చేయలేరు. సాహసం చేయలేరు. ఈ సందర్భంగా పివిపికి, యూనిట్ మొత్తానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను’ అన్నారు.