దూసుకొస్తున్న మాస్ పోలీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ హీరో ఇమేజ్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఆడియన్స్‌కి దగ్గరయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. తాజాగా మాస్‌ని ఆకట్టుకునేలా పోలీస్ కాప్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆ చిత్రమే -కవచం. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చేసేది పోలీస్ పాత్రే అయినా, మాస్‌కి నచ్చే అంశాలకే ఎక్కువ ఉండేలా చూసుకున్నాడట. డిసెంబర్ 7న కవచం థియేటర్లకు రానున్న నేపథ్యంలో, ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. డబుల్ బ్యూటీల సోలో పోలీస్‌గా తన మార్క్ పెర్ఫార్మెన్స్ ‘కవచం’తో హిట్టు అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు బెల్లంకొండ. శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్‌లు మెప్పించనున్నారు. యూత్‌ని అట్రాక్ట్ చేసే ఉద్దేశంతో సినిమాకు సంబంధించి ఆడియో కార్యక్రమాన్ని భీమవరం శివారు చిన్నమైరంలోని సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల్లో నిర్వహించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చాడు.