‘వెల్‌కం జిందగీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాస కళ్యాణ్- పోద్దార్‌లను హీరో హీరోయిన్‌లుగా పరిచయం చేస్తూ ‘పిల్లర్ 9 ప్రొడక్షన్స్’ నిర్మిస్తోన్న తొలి చిత్రం ‘వెల్‌కం జిందగీ’. ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌కి శాలు లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. పదిమందికి సాయపడితే, అదే సాయపడినవాడి జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఆ ఆనందమే వేరు -అన్నది మూవీ కానె్సప్ట్. సినిమా చిత్రీకరణ పూరె్తైంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. తాజాగా సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శాలు లక్ష్మణ్ మాట్లాడుతూ -మనం చేసే చిన్న సాయం ఇతరుల జీవితాల్లో ఎలాంటి ఆనందాన్ని, వెలుగును నింపుతుందో చెబుతూ సాయం ప్రాముఖ్యతను చిత్రంలో వివరించనున్నాం. ఫ్యామిలీ డ్రామాతోపాటు ప్రేమకథా ఆకట్టుకుంటుంది. ఇదో ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. కొత్తవాళ్లే అయినా హీరో హీరోయిన్లు అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. మధుమణి, కమల్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఇద్దరి నటన సినిమాకే హైలైట్. జబర్దస్త్ ఫేం కొమురం హీరో స్నేహితుడిగా కనిపిస్తాడు. అతని కామెడీ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని పంచుతుంది. సినిమాటోగ్రాఫర్ శ్రీసాయి ప్రతి ఫ్రేమ్‌ను అందంగా తెరకెక్కించారు. ఐదు భిన్నమైన పాటలు ఇస్తున్నాం. గౌతమ్ రవిరామ్ సంగీతం అద్భుతం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్నాయి. తాజాగా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశాం’ అన్నారు.