నో ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లీ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ 63వ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక నటించనుందని ఇటీవల వార్తలొచ్చాయి. కానీ ఈ చిత్ర నిర్మాతలు లేడీ సూపర్‌స్టార్ నయనతారను హీరోయిన్‌గా ప్రకటించడంతో అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. ఇక ఈ వార్తలపై ఎట్టకేలకు రష్మిక స్పందించింది. విజయ్- అట్లీ కాంబినేషన్‌లో రానున్న తలపతి 63 మూవీలో నటిస్తున్నారా? అని చాలామంది నన్నడిగారు. కానీ ఈసారి నాకు ఆ ఛాన్స్ రాలేదు. కానీ నెక్స్ట్‌టైం ఈ అవకాశం తప్పకుండా వస్తుందని భావిస్తున్నా. త్వరలోనే కచ్చితంగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తానని రష్మిక క్లారిటీ ఇచ్చింది. ఇక ఆమె ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం చేస్తోంది.