14న ‘అనగనగా..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థౌజెండ్ లైట్స్ మీడియా బ్యానర్‌పై కెఎల్‌ఎన్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. విరాజ్ జె అశ్విన్, రిద్దికుమార్, రాధా బంగారు హీరో హీరోయిన్లు. ప్రతాప్ తాతంశెట్టి దర్శకుడు. చిత్రం డిసెంబర్ 14న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. నిర్మాత కెఎల్‌ఎన్ రాజు మాట్లాడుతూ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యు సర్ట్ఫికెట్ వచ్చింది. డిసెంబర్ 14న సినిమా విడుదలకు సన్నాహాలు చేశాం. క్లీన్ లవ్‌స్టోరీకి తోడు బలమైన సస్పెన్స్ ఉంటుంది. సినిమా చూసినవారు అప్రీషియేట్ చేయడం మాకు నమ్మకం పెరిగింది. హీరో విరాజ్, హీరోయిన్లు రిద్దికుమార్, రాధా బంగారు సహా కాశీవిశ్వనాథ్ ఇతర నటీనటులు చక్కటి ప్రదర్శన ఇచ్చారు. దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టి సినిమాను చక్కగా తెరకెక్కించాడు. ఎడిటర్ మార్తాండ్ వెంకటేశ్, మ్యూజిక్ డైరెక్టర్ కెసి అంజన్ మంచి అవుట్‌పుట్ కోసం కేర్ తీసుకున్నారు. సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ విడుదల చేస్తోందన్నారు. నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ కెఎల్‌ఎన్ రాజు ఎన్నో సినిమాలకు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. ఎన్నో చిత్రాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. ఆయన నిర్మాణంలో రూపొందిన ‘అనగనగా ఓ ప్రేమకథ’ సాంగ్స్, ట్రైలర్ బావున్నాయి. ప్రతాప్ సినిమాను చక్కగా తెరకెక్కించారు. మార్తాండ్ వెంకటేశ్‌గారి మేనల్లుడు హీరో విరాజ్ హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు. అతనికి మంచి భవిష్యత్ ఉంది. సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. మార్తాండ్ కె వెంకటేశ్ మాట్లాడుతూ ‘విరాజ్‌ను హీరోగా చేసిన కెఎల్‌ఎన్ రాజు సాయం మర్చిపోలేనన్నారు. హీరో విరాజ్ జె అశ్విన్ మాట్లాడుతూ హీరో కావాలనే కల నిజమైంది. నిర్మాత కెఎల్‌ఎన్ రాజు చేతులమీద పరిచయం కావడం హ్యాపీగా ఉంది. ప్రతాప్ నా పాత్రను ఎనర్జీతో తీర్చిదిద్దారు. ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు ప్రతాప్ తాతంశెట్టి మాట్లాడుతూ టచ్ హాజ్ ఎ మెమరీ అన్న టాగ్ లైన్ పెట్టామని, అందెందుకో సినిమా చూస్తే అర్థమవుతుందన్నారు. కొత్తవాళ్లతో సినిమా చేయడం చాలెంజింగ్ అనిపించినా, వాళ్ల సహకారంతో సులువుగా పూర్తి చేశామని, అందుకు థాంక్స్ చెప్పారు. డిసెంబర్ 14న థియేటర్లకు వస్తున్న చిత్రాన్ని ఆదరించి యూనిట్‌ను ఆశీర్వదించాలని కోరారు.