‘వెంకీమామ’ రెడీ అవుతున్నాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించనున్న మల్టీస్టారర్ ‘వెంకీమామ’ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 12నుంచి ప్రారంభంకానుందని సమాచారం. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ను చెన్నైలో ప్లాన్ చేశారట. ‘జై లవకుశ’ ఫేమ్ బాబీ తెరకెక్కించనున్న చిత్రంలో వెంకీ సరసన హ్యూమా ఖురేషి, అలాగే చైతుకి జోడిగా రకుల్‌ప్రీత్‌సింగ్ నటించనున్నారు. పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక వెంకీ ప్రస్తుతం ‘ఎఫ్ 2’ షూటింగ్ పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో 17వ చిత్రంగా ‘మజిలి’ చేస్తున్నాడు.