యన్‌టిఆర్ ఫస్ట్ సాంగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం -ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ సినిమా కెరీర్, పొలిటికల్ కెరీర్ నేపథ్యంలో సినిమాను రెండు భాగాలుగా డిజైన్ చేసిన విషయం తెలిసిందే. కథానాయకుడు, మహానాయకుడు టైటిల్స్‌తో సిద్ధమవుతున్న రెండు పార్టుల బయోపిక్ జనవరినే టార్గెట్ చేసి రానున్నాయి. ఇందులో భాగంగా చిత్రంలోని మొదటిభాగం ‘కథానాయకుడు’ నుంచి ‘కథానాయక’ టైటిల్ ట్రాక్‌ని ఆడియన్స్‌కి విడుదల చేశారు. ఇక ఈ కథానాయకుడు జనవరి 9న విడుదలకు సిద్ధమవుతున్నాడు. రెండో భాగం ‘మహానాయకుడు’ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు తేవాలని అనుకున్నా, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కచ్చితంగా వస్తుందా? లేదా? అన్న సందేహాలు లేకపోలేదు. క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రంలో బాలకృష్ణకు జోడిగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తుంటే, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎన్‌బికె ఫిలిమ్స్, వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. తొలిభాగంలో ఎన్టీఆర్ సినిమా కెరీర్‌నే ఫోకస్ చేసిన నేపథ్యంలో, ఎన్టీఆర్‌తో బెస్ట్ కాంబినేషన్స్‌గా నిలిచిన అలనాటి హీరోయిన్లనూ చూపించనున్నారు. సావిత్రిగా నిత్యమీనన్, జయప్రదగా హన్సిక, జయసుధగా పాయల్ రాజ్‌పుత్, శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్ కనిపించనున్నారు.