నమ్మకాన్ని వమ్ముచేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కవచం’. నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్న సినిమా డిసెంబర్ 7న థియేటర్లకు రానుంది. మెహ్రీన్ పిర్జాదా, బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై నవీన్ సొంటినేని (నాని) ఈ సినిమా నిర్మించారు. తమన్ సంగీతం అందించిన చిత్రం ఆడియో వేడుక భీమవరంలో ఘనంగా జరిగింది. నిర్మాత నవీన్ సొంటినేని మాట్లాడుతూ ఫంక్షన్‌ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. సినీ నిర్మాణంలోకి అడుగుపెడుతున్నా అనగానే సపోర్ట్ చేసిన కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారని, మంచి హిట్ కావాలని ఆశిస్తున్నామన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ థమన్ మాట్లాడుతూ నాకు ఎనర్జీ హీరోలంటే ఇష్టం. సాయి కూడా నా ఎనర్జీ హీరోల లిస్టులో ఉన్నాడు. సాయితో పనిచేయాలని చాలా రోజులుగా ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ సినిమాకి పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. బెల్లంకొండ సురేష్‌తో ఆరు సినిమాలు చేశాను. అన్ని హిట్లే. వాటికన్నా ఇది పెద్దహిట్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్, ప్రొడ్యూసర్ నవీన్‌కు ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో సాయిశ్రీనివాస్, కాజల్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉందన్నారు. టీం మొత్తం కష్టపడి చేసినా సినిమా మంచి ఫలితం అందించగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ తాను ఈ పొజిషన్‌లో ఉండటానికి కారణం అభిమానులు, ప్రేక్షకులేనన్నారు. ప్రాజెక్టు చాలా హ్యాపీగా సాగిపోయిందని, డిసెంబర్ 7న ఆడియన్స్ ఆశీర్వాదంతో ఘన విజయం అందుకుంటామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ మాట్లాడుతూ మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు మామిళ్ల, కథను మరో రేంజ్‌కి తీసుకెళ్లిన డీవోపీ చోటా, టెక్నీషియన్లు అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. సినిమా అవుట్‌పుట్ బాగా రావడానికి కారణమైన ప్రొడ్యూసర్ నవీన్‌కు థాంక్స్ చెబుతూ, నన్ను నమ్మి ఇంత బడ్జెట్‌తో సినిమా చేసిన మీతో ఎన్ని సినిమాలైనా చేస్తాను. ఈ నమ్మకం మర్చిపోను. థియేటర్లలో సినిమా చూసి ఆదరించాలని, మీ ప్రేమ నమ్మకం కోసం ఇంకా కష్టపడతానన్నారు.