పరిగెత్తిస్తున్న సింబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘టెంపర్’తో పోలీస్ క్యారెక్టర్‌కు జూ.ఎన్టీఆర్ ఒకింత పొటెన్షియాలిటీ క్రియేట్ చేస్తే, రీమేక్‌లో రణ్‌వీర్ దాన్ని పీక్స్‌కు తీసుకెళ్లేలా ఉన్నాడు. టైటిల్ క్యారెక్టర్‌తో రణ్‌వీర్ చేస్తున్న చిత్రం -సింబా. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రంలో రణ్‌వీర్‌తో సారా అలీ ఖాన్ జోడీకట్టింది. ఎన్టీఆర్ టెంపర్‌కు రీమేక్‌గా వస్తున్న సంబా ట్రైలర్ విడుదలైంది. ‘నీ అంత రాస్కెల్ మరొకరుండడు’ అని విలన్ సోనూసూద్ డైలాగ్‌కు ఆన్సర్‌గా ‘తెలిసిన విషయాలెందుకు సర్.. తెలియందేదైనా ఉంటే చెప్పండి’ అంటూ రణ్‌వీర్ వేసిన పంచ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంతోపాటు, సునిశితమైన హ్యాసాన్ని పండించింది. అతిథి పాత్రలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ హీరోయిజంతో మొదలైన ట్రైలర్, ‘పోలీస్’ అని అరుస్తూ రౌడీలను తరిమితరిమి కొట్టే రణ్‌వీర్ పాత్రతో ట్రైలర్ పూరె్తైంది. ఓ పోలీస్ అధికారి (అజయ్ దేవ్‌గణ్) హీరోయిజాన్ని చూసిన స్ఫూర్తితో డిపార్ట్‌మెంట్‌లోకి రావాలనుకున్న సింబా -పోలీస్ ఆఫీసర్ అవుతాడు. టెంపర్‌కు రీమేక్ మొదలెట్టినపుడు -ఫైట్స్ మాత్రమే తప్ప ప్లాట్ తీసుకోవడం లేదని బాలీవుడ్ టీం చెప్పినా -ట్రైలర్ చూస్తే టోటల్ స్టోరీనే తెరకెక్కిస్తున్నారన్న విషయం అర్థమవుతుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్‌జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం డిసెంబర్ 28న థియేటర్లకు రానుంది.