కల్యాణ్ సస్పెన్స్ థ్రిల్లర్ 118

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకపక్క కమర్షియల్, మరోపక్క వైవిధ్య చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ హీరోగా తన ప్రత్యేకత చాటుకుంటున్నారు నందమూరి కల్యాణ్‌రామ్. కల్యాణ్ హీరోగా రానున్న తాజా స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘118’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్ సోమవారం విడుదలైంది. షూటింగ్ పూర్తవ్వడంతో, శరవేగంగా పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్ కోనేరు మాట్లాడుతూ నందమూరి కల్యాణ్‌రామ్ ఇప్పటివరకు చేయనటువంటి జోనర్ ఇది. సరికొత్త పాత్రలో మెప్పించనున్నారు. ఇదొక స్టైలిష్ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్. కథ, కథనంతోపాటు యాక్షన్ పార్ట్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. వెంకట్, అనబ్‌రివు, రియల్ సతీష్ అద్భుతమైన యాక్షన్ పార్ట్‌ను అందించారు. నివేదా థామస్, షాలినిపాండే హీరోయిన్లుగా మెప్పిస్తారు. బ్యూటిఫుల్ విజువల్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు కేవీ గుహన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దర్శకత్వంతోపాటు ఆయన కథ, కథనం, సినిమాటోగ్రఫీ అందించారు. శేఖర్‌చంద్ర సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. సినిమాను వచ్చే ఏడాది జనవరి ద్వితీయార్థంలో విడుదల చేయాలనుకుంటున్నాం’ అన్నారు.