బిల్డప్‌లు నచ్చవు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్. చేసిన సినిమాల్లో చాలావరకు పరాజయాలు ఎక్కువ. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని మళ్ళీరావా అంటూ థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేసి నిలదొక్కుకున్నాడు. మరోసారి సుబ్రహ్మణ్యపురం ద్వారా సరికొత్త థ్రిల్లర్‌ని పరిచయం చేస్తున్నాడు. సుమంత్, ఈషారెబ్బా జంటగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో బీరం సుధాకర్‌రెడ్డి నిర్మించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సినిమా 7న విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో హీరో సుమంత్ మాటా మంతీ.

ప్రేమకథలు అనుకుంటే..
‘మళ్ళీరావా’ కథ వినగానే బాగా నచ్చింది. చాలావరకు నా సినిమాలను కమర్షియల్ పాయంట్‌లో ఆలోచించను. ‘మళ్ళీరావా’ సక్సెస్ తర్వాత నాకు ప్రేమకథలు వస్తాయని అనుకుంటే థ్రిల్లర్ కథలు వచ్చాయి. ఒకేతరహా కథలు చేయడం నచ్చలేదు. మారుస్తూ ఉంటాను. నాకు థ్రిల్లర్ సినిమాలు నచ్చవు. సినిమా కథ వినే మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయిపోదామనే అనుకున్నా. అయితే దర్శకుడు సంతోష్ నన్ను రెండున్నర గంటలపాటు కూర్చోపెట్టాడు. ఎలాంటి మార్పుచేర్పులు లేకుండా షూటింగ్ మొదలెపెట్టాం. కొన్ని కథల్లో నేను కూడా డైరెక్టర్‌తో ట్రావెల్ చేసేటప్పుడు చిన్నచిన్న మార్పులు చెబుతుంటాను.
దండం పెట్టుకుంటా...
సంతోష్ నాకు కథ చెప్పినప్పుడు కథంతా బాగానే చెప్పాడు. అయితే టెక్నికల్‌గా డీల్ చేయగలడా అన్న చిన్న సందేహమైతే మనసులో ఉంది. తను చాలా షార్ట్ఫిలింస్ చేశాడు. కొన్నింటికి అవారులూ వచ్చాయి. అన్నీ షార్ట్ఫిలింస్ థ్రిల్లర్ జోనర్‌లోనివే. అవి చూసి తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నిర్మాత సుధాకర్‌రెడ్డి మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్డ్‌గా చేద్దామనుకునే తత్వం కాదు. నా పేరు కార్తీక్. హేతువాది, నాస్తికుడు. అయితే నేను నిజానికి ఆస్తికుడిని. గుళ్లకు, చర్చిలకు, మసీదులకు వెళ్తుంటాను. ప్రార్థనలు చేయను కానీ, దణ్ణం పెట్టుకుంటా. పురాతన ఆలయాలపై రీసెర్చ్ స్కాలర్‌గా కనిపిస్తాను.
అవి నాకు నచ్చవు..
నాకు ఇంట్రడక్షన్ సాంగ్స్, ఫైట్స్, స్లోమోషన్ బిల్డప్‌షాట్స్ ఉండాలనుకోను. అయితే నా స్నేహితులు మహేశ్, తారక్‌లు చేస్తే నాకు ఇష్టం. విజిల్ కూడా వేస్తాను. ఈ సినిమాలో కథానుగుణంగా గ్రాఫిక్స్ ఉంటాయి. అంతే తప్ప ఏదో భారీ రేంజ్‌లో గ్రాఫిక్స్ ఉంటాయని చెప్పను. ఈ చిత్రానికి స్పష్టమైన తెలుగును వాడాం. తన యాంగిల్‌లో కథను చెప్పడం ఉంటుంది కాబట్టి బాగా తెలుగు మాట్లాడే వ్యక్తికావాలని అనుకున్నాం. అలా అనుకోగానే రానా గుర్తుకొచ్చాడు. డైరెక్టర్ సంతోష్ వెళ్లి కథ చెప్పగానే తనకు బాగా నచ్చింది. తను షూటింగ్ సమయంలో ఉన్న గ్యాప్‌లో డబ్బింగ్ చెబుతూ వచ్చాడు.
అదృష్టంగా భావిస్తా..
క్రిష్‌తో నాకు చాలాకాలంగా మంచి పరిచయముంది. తను ‘యన్.టి.ఆర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఇందులో తాతగారి పాత్ర ఉంటుందని అనుకోలేదు. క్రిష్ తాతగారి పాత్రకోసం నన్ను అప్రోచ్‌కాగానే నా అదృష్టంగా, ఆశీర్వాదంగా భావించాను. ఫుల్ ప్లెడ్జ్‌డ్ క్యారెక్టర్ చేశాను. రెండు భాగాల్లోనూ కనపడతాను. బాలకృష్ణతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. తాతగారిలా చేయడం కష్టంగా ఉంటుందా? లేదా? అని ఆలోచించలేదు. ఓ బాధ్యతగా తీసుకుని నటించాను. అలాగని ఎక్కువ ఒత్తిడి ఫీల్‌కాలేదు. ఇమిటేషన్‌కి, యాక్టింగ్‌కి మధ్యలో ఓ చిన్న లైన్ ఉంటుంది. అలాంటి లైన్‌లో ఉండే నటనను చేసుకుంటూ వచ్చాను. బాలకృష్ణ ఓ ఎన్‌సైక్లోపీడియా. ఆయన సినిమాలకు సంబంధించిన డైలాగ్స్‌ను అలా చెప్పేసేవారు. తాతగారు సెట్స్‌లో ఎలా ఉండేవారో ఎలాచేసేవారో కూడా చెప్పేవారు. ఆయనతో కలిసి చేయడం నా అదృష్టం.
తాతగారిలా ఉంటానని..
మా కుటుంబ సభ్యులంతా నేను తాతగారిలా ఉంటానని అనుకుంటూ ఉంటారు. నేను మా అమ్మలా ఉంటాను. మా అమ్మ అచ్చం తాతగారిలా ఉంటారని అంటుంటారు. ఆయనతో పెరగడం, ఆయన నన్ను దత్తత తీసుకుని పెంచారు. ఆయన పోలికలురావడం నా అదృష్టం. నేను మేకప్ వేసుకుంటున్నప్పుడు అద్దంలో చూసి తాతగారిని చూస్తున్నాననే ఫీల్ అయ్యేవాడిని. మహానటిలో చైతన్య తాతగారిలా చేశాడు. అది కూడా ఎంజాయ్ చేశాను. ఇక నా నెక్స్ట్ సినిమా ‘ఇదంజగత్’ విడుదలకు సిద్ధంగా ఉంది. తదుపరి కొత్త దర్శకుడితోనే సినిమా చేయబోతున్నాను. పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా. అన్నాచెల్నెల అనుబంధం ఆధారంగా ఆ సినిమా ఉంటుంది.

-శ్రీనివాస్ ఆర్.రావ్