రొటీన్‌కి ఫుల్‌స్టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న తమన్నా ఇప్పటికే ఎన్నో విభిన్నమైన పాత్రల్లో మెప్పించి ప్రేక్షకుల హృదయాల్లో మిల్కీ భామగా నిలిచిపోయింది. ఈసారి సరికొత్త ప్రేమకథతో నెక్స్ట్ ఏంటి అంటూ ప్రేక్షకుల ముందుకు సందీప్‌కిషన్‌తో వస్తుంది. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వం వహించిన చిత్రాన్ని రైనా జోషి, అక్షయ్ పూరి నిర్మించారు. ఈనెల 7న సినిమా సందర్భంగా తమన్నా కబుర్లు.
* ఈ పాత్రలో కొత్తదనం ఏమిటి?
-అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేశాను. అయితే నా ఏజ్‌కు తగినట్లు.. సిటీ కల్చర్‌ను ఎలివేట్ చేసేటువంటి పాత్రలు చేయలేదని ఆలోచిస్తున్న సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లి ఈ కథతో నన్ను కలిశారు. బాగా నచ్చిన కథ.
* కథ గురించి?
-లండన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఇప్పటి యూత్ ఆలోచనలను ప్రతిబింబించే సినిమా. అలాగే నేటితరం అమ్మాయిలు ఎలా ఆలోచిస్తున్నారనేదీ చిత్రంలో చూపించారు దర్శకుడు. వస్తధ్రారణ, కనిపించే విధానాన్ని బట్టి అమ్మాయిలను అంచనా వేయకూడదని, వారి జీవితానికి సంబంధించిన నిర్ణయాలు వారే తీసుకునే హక్కు ఉంటుందని చూపించాం. తనకు నచ్చిన అబ్బాయిని అమ్మాయి ఫేస్ చేసినపుడు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదీ చూస్తారు. మంచి లవ్‌స్టోరీ రన్.
* విషయాన్ని బోల్డ్‌గా చెప్పినట్టున్నారు?
-లేదు. ప్రేమ, సెక్స్ అనేవి సాధారణ విషయాలు. వాటి గురించి బోల్డ్‌గా మాట్లాడే యువతిగా చేసిన పాత్ర కావడంతో ఎలా ఉంటుందనే ఆసక్తి మొదలైంది. చాలా నేచురల్‌గా, వినోధభరితంగా సాగే చిత్రం. సీరియస్‌గా ఏదో బరువైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఏడిపించడం నాకు ఇష్టం ఉండదు. ఈ పాత్ర నాకొక ఛాలెంజింగ్‌గా అనిపించింది. అలాగే సంభాషణలతో వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యాను. ఆ పాత్రలో నిజంగా నన్ను నేను ఊహించుకున్నాను.
* బేసికల్‌గా ఎలాంటి పాత్రలంటే మీకు ఇష్టం?
-హ్యపీడేస్, 100 పర్సెంట్ లవ్ చిత్రాల తర్వాత నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు చేయడం తక్కువగానే చేశాను. మళ్లీ అలాంటి పాత్ర ఇదే. నిజ జీవితంలో ఎలా ఉంటానో అలాగే కనపడతాను. నా శైలి ఎమోషన్స్ ఇందులో కనపడతాయి. నాతో పాటు సందీప్ కిషన్, శరత్‌బాబు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. సాధారణంగా తండ్రి-కొడుకుమధ్య అనుబంధాన్ని చూపే సినిమాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందులో తండ్రీ కూతురు మధ్య వుండే రిలేషన్‌ను చూపిస్తున్నాం. హృద్యంగా ఉంటుంది.
* ప్రస్తుత తెలుగు సినిమాల్లో మార్పులు?
-తెలుగు ఇండస్ట్రీలో కొత్త కానె్సప్ట్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక్కడ సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇండస్ట్రీస్ పరంగా హద్దులన్నీ చెరిగిపోయాయి. మంచి మంచి సినిమాలు రూపొందుతున్నాయి. ఆదరణ పొందుతున్నాయి. అలాంటి చిత్రాల వరుసలో నెక్స్ట్ ఏంటి నిలుస్తుందని నా నమ్మకం.
* తదుపరి చిత్రాలు
బాహుబలితో వైవిధ్యమైన సినిమాలు చేయగలననే నమ్మకం నాలో కలిగింది. అందుకే నటిగా ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుంటున్నాను. ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఎఫ్2 చిత్రంలో నటిస్తున్నాను. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో సినిమా చేస్తున్నాను. అలాగే సైరా నరసింహారెడ్డి సినిమాలో చిరంజీవిగారితో కలిసి నటించబోతున్నాను. చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది.