జిల్..కాజల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాజల్ కెరీర్ తిరిగి భారతీయుడులో పడింది. ఇప్పుడు కమల్‌తో కాజల్ జోడీ కట్టబోతోంది. శంకర్-కమల్ కాంబోలో వచ్చిన భారతీయుడు’ ఏ రేంజ్ హిట్టు అందుకుందో తెలిసిందే. ఆ చిత్రం సీక్వెల్ పనులు శంకర్ చాలాకాలం క్రితమే మొదలెట్టేశాడు. నిజానికి రజనీ-కమల్‌తో 2.ఓ ప్లాన్ చేసుకున్నాడు శంకర్. కానీ -2.ఓలో ప్రతినాయక పాత్రకంటే భారతీయుడు సీక్వెల్ చేయడం బెటరన్న కమల్ మనసులో మాట బయటపెట్టడంతో సీన్ మారిపోయింది. 2.ఓ చిత్రం విడుదలకు ముందునుంచే భారతీయుడు-2 ప్రీపొడక్షన్ పనులు శంకర్ మొదలుపెట్టడం తెలిసిందే. దీంతో కమల్‌కు జోడీగా ఎవరుంటారన్న అంశంపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఊహాగానాల్లో అనేకమంది హీరోయిన్ల పేర్లు వినిపించిన తరువాత -కొద్దిరోజుల పాటు నయనతార పేరు వద్ద చర్చ ఆగింది. తరువాత మళ్లీ కాజల్ పేరు సైతం తెరపైకి వచ్చింది. అటు తిరిగి ప్రాజెక్టులో కాజల్ కన్ఫర్మ్ అయినట్టు చిత్రబృందం చెబుతోంది. భారీస్థాయిలో తెరకెక్కించనున్న భారతీయుడు-2 చిత్రానికీ లైకా ప్రొడక్షనే్స బాధ్యతలు తీసుకుంది. కొద్దిరోజుల క్రితం పూజా కార్యక్రమాలూ నిర్వహించడం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన రజనీ చిత్రం 2.వో కలెక్షన్ల వర్షం కురిపించడంతో ఉత్సాహంతోవున్న శంకర్, భారతీయుడి సీక్వెల్ షూటింగ్‌ను డిసెంబర్ 14నుంచే ప్రారంభిస్తాడని అంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించి, రెండో షెడ్యూల్‌ను చైన్నైకు షిఫ్ట్ చేయొచ్చని అంచనా. ఇదిలావుంటే ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న భారీ ప్రాజెక్టులో కాజల్‌కు చాన్స్ దక్కడం, అదీ కమల్ సరసన కావడంతో ఆమె కెరీర్ మరి కొనే్నళ్లు జెట్ స్పీడ్‌తో పరిగెత్తడం ఖాయమంటున్నారు సినీజనాలు. తెలుగులో కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌తో జతకట్టి కాజల్ చేసిన ‘కవచం’ డిసెంబర్ 7న విడుదలకు సిద్ధమైంది. పోస్టర్, టీజర్లలో తన గ్లామర్ రేంజ్‌ను ప్రదర్శిస్తున్నక కాజల్, మరోపక్క ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రంలో లీడ్‌రోల్‌తోనూ ఆకట్టుకోనుంది. జయం రవి హీరోగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కాజల్ వైవిధ్యమైన అల్లరి పాత్ర పోషిస్తోందని వినికిడి. ఇప్పుడు భారతీయుడు ప్రాజెక్టులో చోటుదక్కడంతో -తోటి హీరోయిన్ల కాంపిటీషన్‌లో కాజల్ పదిమెట్లు పైకెక్కినట్టే అంటున్నారు.