విలేజ్ టు అండర్‌వరల్డ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయలక్ష్మీ కొండా నిర్మాతగా, దర్శకుడు కొవెర హీరోగా తెరకెక్కిన చిత్రం యు. హిమాన్షి కాట్రగడ్డ, స్వాప్నారావ్ నాయికలు. ఈనెల 14న విడుదల సందర్భంగా హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ ‘యు’ టైటిల్‌కి కథే హీరో అన్నారు. కథాపరంగా ఉన్న అనుభవంతో ‘యు’ రాశానని, పల్లెటూరిలో మొదలై అండర్ వరల్డ్‌లో ఎండ్ అయ్యే కథ అన్నారు.
80 ఏళ్ల సినిమా చరిత్రలో ఎవరూ టచ్‌చేయని ప్రాజెక్ట్ ఇది. ఈ కథను పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌కోసం రాసుకున్నాను. 100కోట్లతో తీయాల్సిన సినిమా. మాదగ్గర అంత బడ్జెట్ లేక కోటితో తీసాం. సినిమా మొత్తం హీలియమ్ 8కె కెమెరా వాడాం అన్నారు. శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ సినిమా బాగా వచ్చిందని, దర్శకుడు తన పాత్ర మీద ప్రేమ పెంచుకుని కథ చెప్పారన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు ఎన్నో ఆశలతో వచ్చాడు కొవెర. అతనికి మద్దతుగా నిలిచిన తల్లికి, భార్యకి అభినందనలు. నా దగ్గరకు ఈ ప్రాజెక్ట్‌ను శుభలేఖను సుధాకర్ పంపారు. చాలా ప్రాణంపెట్టి పనిచేశారు. ఈ సినిమాకు పనిచేసిన అందరి కృషికి ఫలితం దక్కాలని ఆశిస్తున్నా అన్నారు.
నిర్మాత విజయలక్ష్మీ కొండా మాట్లాడుతూ రవితేజ ఏదో సినిమాలో అడిగినట్టు, నా కొడుకు ప్రతి రోజూ నన్ను ఒక్క ఛాన్స్ అమ్మా అనేవాడు. మా అబ్బాయి కోసం సినిమా చేశాం. సినిమా సక్సెస్ అవుతుందో లేదోకానీ, మా అబ్బాయి కష్టానికి గుర్తింపురావాలన్నదే నా కోరిక’ అన్నారు. రాఘవ, నాగి, రోహిణి, సంధ్య, స్వప్నరావ్, లహరి, దొరబాబు, కోయ కిశోర్ ఇతర కీలక పాత్రధారులు.