జన జీవితం.. బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా హీరో హీరోయన్లు. గోరటి వెంకన్న కీలక పాత్ర పోషించారు. చిత్రాన్ని దర్శకుడు సాగసాయి మాకం తెరకెక్కించారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ వాస్తవ కథలతో సహజత్వం ఉట్టిపడేలా సినిమాలు నిర్మించాలంటే గట్స్ ఉండాలంటూ, నిర్మాత మహంకాళి శ్రీనివాస్ అలాంటి సాహసం చేశాడన్నారు. ఆసక్తి కలిగిస్తున్న ట్రైలర్ చూస్తుంటే, బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ ప్రేక్షకులను నిరాశపర్చదన్న నమ్మకం కలుగుతోందన్నారు. తెలంగాణ పల్లె వాతావరణం చిత్రంలో కనిపిస్తుందన్నారు. నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమా కథలు జీవితాల నుంచే పుడతాయి. బిలాల్‌పూర్ పోలీస్‌స్టేషన్ కథ మన చుట్టూ ఉన్న ప్రజలను దగ్గరగా చూసిన స్ఫూర్తితో రాసుకున్నాను. దర్శకుడు నాగసాయి నేనిచ్చిన కథను అంతే చక్కగా రూపొందించారు. కథను వాణిజ్య హంగులు ఉంటూనే సహజత్వం ఉండేలా నిర్మించాం. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్ రెండోవారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ మా సినిమా చూస్తే ప్రతి ఒక్కరికీ వాళ్ల ఊరు, ఊళ్లో సంఘటనలు గుర్తొస్తాయన్నాడు. ఇది కాల్పానిక కథ కాదని, కళ్లముందున్న సంఘటనలనే సినిమా చేశామన్నారు. ఒక ఊళ్లోని పోలీస్ స్టేషన్‌కు ఎలాంటి వింత వింత కేసులు వస్తాయన్నది చిత్ర కథాంశమన్నారు. అందులో వినోదాత్మకంగా సాగే అంశాలతోపాటు ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కొన్ని చేదు ఘటనలూ ఉంటాయన్నారు. సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుందని అన్నారు.