భారత్‌లో ముందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినీ ప్రేమికులను త్వరలో మరో త్రీడీ సినిమా అలరించబోతోంది. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీ, గ్రేట్ డైరెక్టర్ శంకర్, బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్‌ల సినిమా రోబో 2.0 త్రీడీ వెర్షన్లో కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేటర్లనుంచి వెళ్లకముందే మరో త్రీడీ సినిమా మనల్ని అలరించనుంది. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌లో తెరకెక్కిన ఆక్వామేన్ అనే త్రీడీ సినిమా ఈనెల 14న విడుదల కానుంది. అమెరికాలో కంటే ముందుగా ఇక్కడే ఈ సినిమా విడుదలకావడం విశేషం. జేసన్ మమోవా, అంబర్ హియర్డ్ కలిసి నటించిన చిత్రం ‘ఆక్వామేన్’. జేమ్స్‌వాన్ దర్శకత్వం వహించిన యాక్షన్ మూవీ ఇది. జేసన్ మమోవా టైటిల్ రోల్‌లో కనిపిస్తారు. ఈ సినిమాను డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాలో కంటే వారం ముందుగా భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగులో విడుదల చేస్తున్నారు. వార్నర్ బ్రదర్స్ ఈ సినిమాను త్రీడీలోనూ, ఐమాక్స్ త్రీడీలోనూ విడుదల చేయనుంది. తెలుగులో నిర్మాత ఎన్వీప్రసాద్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.