సూపర్‌పవర్ మొదలైందిc

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ ఫిలిం ఫ్యాక్టరీ బేనర్‌పై శివ జొన్నలగడ్డ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘సూపర్‌పవర్’. ఈ చిత్రం ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ప్రముఖులు సారిపల్లి కొండలరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. వి.సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో శివ జొన్నలగడ్డ మాట్లాడుతూ.. ‘గతంలో చేసిన ‘పోలీస్ పవర్’ మాస్ హీరోగా నిలబడటానికి తోడ్పడిందని, అదే స్ఫూర్తితో సొంత బ్యానర్‌లో ‘మాస్ పవర్’ నిర్మించానన్నారు. ఆ చిత్రాన్ని జనవరిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, ఇప్పుడు ‘సూపర్ పవర్’ చిత్రం ప్రారంభించామన్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ‘సూపర్ పవర్’ ఉంటుందని, అడ్డంకులు అధిగమించి ‘సూపర్ పవర్’ కప్పు హీరో ఎలా సొంతం చేసుకున్నాడన్నది ఇతివృత్తమన్నారు. గత చిత్రాలను ఆదరించినట్టు ఈ సినిమానూ ఆదరించాలని కోరారు. సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ.. ‘శివ నాకు తొలి సినిమా నుంచి తెలుసు. సినిమా సినిమాకు ఎంతో ఇంప్రూవ్ అవుతూ ఫైట్స్, డాన్స్ అద్భుతంగా చేస్తున్నాడు. ఇంకా శివ ఎంతో మందికి పనికల్పిస్తూ వృద్ధిలోకి రావాలన్నారు. వి.సాగర్ మాట్లాడుతూ.. ‘‘శివ మంచి టెక్నిషీయన్. ‘పోలీస్ పవర్’. మాస్‌పవర్‌లా సూపర పవర్ చిత్రం ఆడాలన్నారు. కార్యక్రమంలో జొన్నలగడ్డ శివ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. అలాగే ‘మాస్ పవర్’ చిత్రం లోని ఫైట్స్, ట్రైలర్ ప్రదర్శించారు.